twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ వదిలేయగా,సూపర్ హిట్టైనవి:‘ఊపిరి’తో కలిపి మొత్తం ఎనిమిది

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎలాంటి కథలు, ఎలాంటి దర్శకులను ఎంపిక చేసుకుంటామనే విషయం మీదే సగం పైగా సక్సెస్ ఆధారపడి ఉంటుందంటారు రజనీకాంత్,అమితాబ్ వంటి సీనియర్స్. తమ దగ్గరకు వెతుక్కుంటూ వచ్చిన స్క్రిప్టుని ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి,మరీ కాదనుకుంటేనే నో చెప్తూంటారు. అయితే అలాంటి సందర్బాల్లోనూ అవి వేరే హీరోలు చేసి సక్సెస్ అవుతూండటం జరుగుతూంటుంది.

    ఇప్పుడీ టాపిక్ ఎందుకూ అంటే..క్రితం శుక్రవారం రిలీజైన 'ఊపిరి' చిత్రం లో మొదట ఎన్టీఆర్ ని అనుకున్నారు. అయితే డేట్స్ సమస్యో, వేరే కారణాలో కాని ఎన్టీఆర్ నో చెప్పేసాడు. ఆ సినిమా రిలీజై ఇప్పుడు కార్తీ,నాగార్జునలకు పేరు తేవటమే కాక ,కలెక్షన్స్ పరంగానూ ఊపుతోంది.

    దాంతో ఎన్టీఆర్ ..అనవసరంగా ఈ చిత్రాన్ని వదులుకున్నాడే అనే చర్చ మీడియాలో బయలు దేరింది. సోషల్ మీడియాలో అయితే అభిమానులు ఈ విషయమై గంటలు తరబడి కామెంట్ల యుద్దాలు, చర్చలు చేస్తున్నారు.

    అయితే ఎన్టీఆర్ వదిలేయగా సినిమాలు హిట్టవటం ఇదే తొలిసారి కాదు అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. గతంలోనూ రకరకాల కారణాలతో ఆయన వద్దనుకున్న చిత్రాలు భాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. ఆ చిత్రాలు స్లైడ్ షోలో ఒక్కసారి చూద్దాం...

    దిల్

    దిల్

    నితిన్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రానికి మొదట ఆప్షన్ ఎన్టీఆర్. దిల్ రాజు ఈ విషయమై ఎన్టీఆర్ ని కలిస్తే అప్పుడు వేరే బిజిలో ఉండటంతో ఎన్టీఆర్ నో చెప్పారు.

    ఆర్య

    ఆర్య

    సుకుమార్ తొలి చిత్రం ఆర్య. అల్లు అర్జున్ కెరీర్లో మరిచిపోలేని చిత్రం. ఈ చిత్రంపై తొలి నుంచీ దిల్ రాజు కు మంచి అంచనాలే ఉన్నాయి. అయితే దిల్ రాజు తొలి ఆప్షన్..ఎన్టీఆర్. అయితే ఇదీ ముందుకు వెళ్లలేదు.

    భధ్ర

    భధ్ర

    బోయపాటి శ్రీను ని దర్శకుడుగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన చిత్రం భధ్ర. రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. ఈ సినిమా సమయంలోనూ మొదట కథ..ఎన్టీఆర్ కు చెప్పించారు దిల్ రాజు.

    అతనొక్కడే

    అతనొక్కడే

    సురేంద్రరెడ్డిని దర్శకుడుగా పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ నిర్మించి, నటించిన చిత్రం అతనొక్కడే. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కథని మొదట ఎన్టీఆర్ కు చెప్పించారట. అయితే రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు.

    కిక్

    కిక్

    సురేంద్రరెడ్డి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన కిక్ చిత్రం ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. ఈ చిత్రం కథని మొదట ఎన్టీఆర్ కు చెప్పించారు. అయితే అప్పుడున్న ఈక్వేషన్ తో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు.

    కృష్ణ

    కృష్ణ

    రవితేజ, వివి వినాయిక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. ఈ సినిమా కథను కూడా తారక్ ని దృష్టిలో పెట్టుకునే డిజైన్ చేసారట. అయితే ఎన్టీఆర్ నో చెప్పేకే రవితేజ దగ్గరకు వెళ్లిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

    శ్రీమంతుడు

    శ్రీమంతుడు

    కొరటాల శివ దర్సకత్వంలో రూపొందిన శ్రీమంతుడు కథని మొదట ఎన్టీఆర్ తో చేస్తాడని అనుకున్నారు. అంతా సెట్ అయ్యిందనుకున్న టైమ్ లో ఆ ప్రాజెక్టు ఆగిపోయి మహేష్ దగ్గరకు వెళ్లి , అక్కడ హై సక్సెస్ అయ్యింది.

    ఊపిరి

    ఊపిరి

    ఈ సినిమాలో కార్తి పాత్రకు గానూ వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ ని అడగటం జరిగింది. ఎన్టీఆర్ కూడా నచ్చి, నాగార్జున కు ఫోన్ చేసి మరీ ప్రాజెక్టు ఓకే చేయించాడు. కానీ చివరి నిముషాల్లో ఎందుకనో తప్పుకోవటంతో కార్తీ సీన్ లోకి వచ్చారు.

    English summary
    NTR has turned down eight film offers that came his way so far either due to date issues or for some other reason. They have all turned into blockbusters including the recently released Nagarjuna-Tamannaah starrer ‘Oopri’!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X