»   » బాలయ్య , ఎన్టీఆర్ ల మ్యాటర్ రూమరా?

బాలయ్య , ఎన్టీఆర్ ల మ్యాటర్ రూమరా?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ తాజా చిత్రం డిక్టేటర్ ఆడియో పంక్షన్ కు ఎన్టీఆర్ హాజరవుతారా... ఇదే విషయం ఇప్పుడు నందమూరి అభిమానుల్లో చర్చనీయాంసంగా మారింది. ఈ ఆడియో పంక్షన్ కు ఎన్టీఆర్ ని పిలిచారని చెప్పుకుంటున్నారు. అందులో నిజమెంత ఉందనేది తెలియరావటం లేదు.

జూ.ఎన్టీఆర్ ఆడియో జరిగే సమాయానికి స్పెయిన్ నుండి ఈనెల 12న రావలసి ఉంది. ఎందుకంటే నాన్నకు ప్రేమతో సినిమా లాస్ట్ షేడ్యుల్ హైగరాబాద్ లో ప్లాన్ చేసారు. కాబట్టి...జూ.ఎన్టీఆర్ కనుక ఫ్రీటైం దొరికితే బాబాయ్ డిక్టేటర్ ఆడీయో ఫంక్షన్ కి అటెండ్ అవుతాండంటూ చెప్తున్నారు. కొందరు మాత్రం ఇదంతా కేవలం రూమర్ అని కొట్టిపారేస్తున్నారు.

నిజానికి ఎన్టీఆర్, డిక్టేటర్ ఆడీయో ఫంక్షన్ కి అటెండ్ అవ్వడానికి అబ్యంతరమెమి లేదు.. కాకపోతే జనవరి 13న విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా చివరి షేడ్యుల్ ఉండటం కుదరకపోవచ్చు అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.

NTR may attend Balayya's Dictator audio

అయితే వాస్తవానికి బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ ల మధ్య వివాదం నడుస్తోంది. ఎన్టీఆర్ ఎలక్షన్స్ ప్రచారాలనుండి తప్పకున్నాడు..అందుకు కోపంగా ఉన్నాడు బాలయ్య అని చెప్తున్నారు. ఇద్దరూ ప్రైవెట్, పబ్లిక్ ఫంక్షన్ లకి ఎక్కడా ఎదురుపడటకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వీరిరువురు కలిస్తే రెండు తెలుగు రాష్టాల్లోని తెలుగుదేశం పార్టీకి కూడా కలసివచ్చే సూచనే అనేది మాత్రం నిజం.

మరో ప్రక్క...నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం 'డిక్టేటర్‌' ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆంధ్రుల నూతన రాజధాని అమరావతిలో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా బాలయ్య అభిమానులు 99 కార్లతో ర్యాలీ నిర్వహించి అరుదైన రికార్డు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తమ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ చిత్రాన్ని జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది.

దర్శకుడు మాట్లాడుతూ, 'బాలయ్య 99వ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని తెలుసు. వారి అంచనాలకు తగ్గట్టుగా ఉండే చిత్రమిది. ఆయన అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలనుకుంటున్నారో, దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంలో చూపించబోతున్నాం. డిఫరెంట్‌గా ఉంటూనే ఇప్పటి వరకు చూడని స్టయిలీష్‌ యాంగిల్‌లో బాలకృష్ణ అలరించనున్నారు.

నిర్మాత మాట్లాడుతూ... , 'ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహి స్తున్నాం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
NTR would attend audio launch event of Balakrishna's Dictator.
Please Wait while comments are loading...