twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు హామీతో ఎన్టీఆర్ ఓకే అన్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఆ మధ్యన ఎన్టీఆర్, దిల్ రాజు కాంబినేషన్ లో గతంలో ‘బృదావనం' , ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు వచ్చాయి. ‘బృదావనం' చిత్రం కమర్షియల్ గా విజయం సాధిస్తే... ‘రామయ్యా వస్తావయ్యా' డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరో సారి ఈ కాంబినేషన్ రిపీట్ అవబోతోందని సమాచారం. అందుకోసం దర్శకుడుగా బొమ్మరిల్లు భాస్కర్ ని ఎంచుకున్నట్లు సమాచారం. గతంలో ఇదే బ్యానర్ లో భాస్కర్ తో దిల్ రాజు...బొమ్మరిల్లు, పరుగు చిత్రాలు హిట్ కొట్టి ఉన్నారు.

    అయితే ఒంగోలు గిత్త తర్వాత భాస్కర్ సైతం వెనక పడ్డారు. దిల్ రాజు సైతం వరస ఫెయిల్యూర్స్ తో ఉన్నారు. ఎన్టీఆర్ కూడా సరైన ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్నారు. దాంతో మంచి స్టోరీ లైన్ తో భాస్కర్ వచ్చాడని, దానిపై కసరత్తుల చేసి హిట్ స్క్రిప్టు గా మార్చే భాధ్యత తనదని హామీ ఇచ్చి ప్రాజెక్టు ఓకే చేయించుకున్నాడని ఇండస్ట్రీ టాక్.

    ఎన్టీఆర్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ నటించే ఈ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఆరెంజ్ తర్వాత తెరమరుగైన ఈ దర్శకుడు ఎన్టీఆర్ కోసం ఓ మంచి కథను రెడీ చేసినట్టు, దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.

    Ntr next movie with Bommarillu Bhaskar

    పూరీ, ఎన్టీఆర్ చిత్రం విషయానికి వస్తే...

    ఎన్టీఆర్‌ హీరోగా పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. కాజల్‌ హీరోయిన్ . పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ప్రస్తుతం గోవా షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొదట అనుకున్న తేదీకే ఎట్టిపరిస్దితుల్లో విడుదల చేయాలని స్పీడుగా పని చేస్తున్నారు.

    నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ఈ రెండో షెడ్యూల్‌తో సినిమా మొత్తాన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్‌, వైజాగ్‌తో పాటు విదేశాల్లోనూ చిత్రీకరణ జరుపుతాం. జనవరి 9న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇందులో ఎన్టీఆర్‌ ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా డెఫినెట్‌గా మ్యూజికల్‌ హిట్టవుతుంది. ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కెరీర్‌లలోనూ, మా బేనర్‌లోనూ ఇది ప్రతిష్ఠాత్మక చిత్రంగా తయారవుతోంది'' అని చెప్పారు.

    ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ, వెన్నెల కిశోర్‌, జయప్రకాశ్‌రెడ్డి, సప్తగిరి, కోవై పరళ, రమాప్రభ, పవిత్రా లోకేశ్‌ తారాగణం. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల.

    English summary
    Bomarill Bhaskar who lastly directed Ongole Giththa may direct Ntr soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X