twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'టెంపర్' : ఎన్టీఆర్ మ్యాటర్ లో అవి కేవలం రూమర్సే

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం 'టెంపర్' కి డబ్బింగ్ చెప్పటం ఆపాసేడంటా వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో సోషల్ మీడియా సైట్లలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ తో విభేధాలు వచ్చాయని, అదీ రెమ్యుషన్ గా ఇవ్వాల్సిన మూడు కోట్లు బ్యాలెన్స్ ఉండిపోయిందని చెప్తున్నారు. అయితే ఆయన శ్రేయాభిలాషులు మాత్రం...ఇప్పుడు డబ్బింగ్ పూర్తి చేసాడని, మధ్యలో డబ్బింగ్ ఆపు చేయటానికి కారణం కేవలం థ్రోట్ ప్లాబ్లం అని, అంతకుమించిన ఊహాగానాలు అనవసరం అని అంటున్నారు. డబ్బులు మ్యాటర్ చర్చించుకోవాల్సి ఉంటే ఏ ఫిల్మ్ ఛాంబర్ లోనే పెడతాడు కానీ ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చెయ్యాల్సిన ఖర్మ ఎన్టీఆర్ కు పట్టలేదని చెప్తున్నారు. ఇంకా రెండు రోజుల్లో రిలీజ్ పెట్టుకుని తన సినిమాను పణంగా పెట్టేడంత తెలివితక్కువ వాడు కాదు... అలా ఇబ్బంది పెట్టే రకం ఎన్టీఆర్ కాదు అని చెప్తున్నారు. ఈ రోజు సెన్సార్, ఈ నెల 13 విడుదల పెట్టుకున్న ఈ సమయంలో ఇటు వంటి వార్తలు, రూమర్స్ కొంచెం ఇబ్బంది పెట్టేవే.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక ఈ విభేధాలుకు ఫుల్ స్టాఫ్ పెట్టాలని పూరి జగన్నాథ్ ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే బండ్ల గణేష్ మాత్రం స్పాట్ లో చెప్పిన వాయిస్ ని ఆ రెండు రీళ్లకు కలిపి వదిలే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వివాదాలకు ఫుల్ స్టాఫ్ పెట్టి...డబ్బింగ్ పూర్తి చేసుకునేలా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది.

    NTR Says No To Dubbing is a Rumour?

    ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అలాగే చిత్రం కు స్టన్నింగ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అందుతున్న సమాచారాన్ని బట్టి దాదాపు అన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ చేసేసారు. ఆడియో పంక్షన్ లో ఈ చిత్రం అవుట్ పుట్ టెర్రిఫిక్ గా వచ్చిందని...తను తన సోదరుడు కలిసి ఈ చిత్రాన్ని స్వయంగా విడుదల చేస్తున్నామని బంగ్ల గణేష్ ప్రకటించారు. దానికి తోడు దర్సకుడు పూరి జగన్నాథ్ సైతం కొన్ని ఏరియాలు రైట్స్ తీసుకుంటున్నట్లు వార్త వచ్చింది. దాంతో ప్రి రిలీజ్ బిజినెస్ 42 కోట్ల వరకూ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా.

    మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానున్నదని సమాచారం. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయమై ప్రకటన చేసి ఉన్నారు. అలాగే .. భ్రమరాంబ థియోటర్ లో గతంలో బాలకృష్ణ లెజండ్ చిత్రం విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ లోగా సీడెడ్ లో చాలా చోట్ల 12 రాత్రి తెల్లారితే 13 అనగా షోలు పడతాయి. అయితే అఫీషియల్ గా ముహూర్తం మాత్రం భ్రమరాంబలో జరగనుంది.

    ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

    English summary
    It is being publicised that Ganesh needs to pay 3 crores balance to NTR and for that reasons our hero is not finishing his dubbing part. A hero of stature like NTR,there is no need to worry about 3 crores because his stardom is times bigger than that.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X