twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ఇలా ఎందుకు చేస్తున్నాడు?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఓప్రక్కన రాష్ట్రం అంతటా 'హుద్‌హుద్‌' విలయం మిగిల్చిన విషాదం గురించి మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సమయంలో సినిమా విడుదల చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్షన్స్ పై ఆశ వదులుకోవాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకునే మోహన్ బాబు తన చిత్రం కరెంట్ తీగ ను వాయిదా వేసారు. అయితే నాగార్జున మాత్రం తన కుమారుడి తాజా చిత్రం 'ఒక లైలా కోసం' ని మాత్రం ఈ శుక్రవారం మనముందుకు తెస్తున్నారు. దాంతో అందరూ అన్ని విషయాల్లో ఎంతో ముందు చూపుతో వ్యవహరించే నాగార్జున ఇలా ఎందుకు చేస్తారని మాట్లాడుకుంటున్నారు.

    'ఒకలైలా కోసం తిరిగాను దేశం' అంటూ పాట పాడుకొన్నారు అక్కినేని నాగేశ్వరరావు. మనవడు నాగచైతన్యకి మాత్రం ఒక్క లైలా సరిపోలేదు. వంద మంది లైలాల మధ్య సందడి చేశాడు. నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం 'ఒక లైలా కోసం'. పూజా హెగ్డే హీరోయిన్. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. నాగార్జున నిర్మాత.

    నాగచైతన్య మాట్లాడుతూ ''రొమాంటిక్‌గా సాగిపోయే ప్రేమకథ ఇది. దర్శకుడు నా పాత్రనీ, ఈ కథనీ తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. అనూప్‌ సంగీతం ఆకట్టుకొంటోంది ''అన్నారు. '

     Oka Laila Kosam is finally releasing on 17th

    అనూప్‌ చెబుతూ ''దర్శకుడిలో సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంది. కథపై క్లారిటీ ఉంది కాబట్టే తక్కువ సమయంలో ఈ సినిమా పూర్తి చేయగలిగారు. ఓ మంచి టీమ్‌తో పనిచేసినందుకు సంతోషంగా ఉంది''అన్నారు. ''కార్తీక్‌ అనే అబ్బాయి కథ ఇది. తన లైలా కోసం ఏం చేశాడో వినోదాత్మకంగా చూపించాం. అనూప్‌ సంగీతం, ఆండ్రూ కెమెరా పనితనం ప్రధాన ఆకర్షణలు''అన్నారు దర్శకుడు.

    నిర్మాత మాట్లాడుతూ... ''ప్రేమకు రీజన్స్‌ ఉండవు. ఓన్లీ ఎమోషన్స్‌' అని నమ్మే యువకుడు. ప్రేమంటే ఆమడ దూరం ఉండే అమ్మాయి. తీపి, పులుపు లాంటి వీరి మధ్య విజయ్‌కుమార్‌ కొండా శైలిలో తెరకెక్కిన ప్రేమకథ ఇది. నేటి యువత మనసులు, ప్రేమలను తెరపై ఆవిష్కరిస్తున్నాం. '' అంటున్నారు నిర్మాత.

    అలీ, సాయాజీ షిండే, రోహిణి, సుమన్‌, సుధ, చలపతిరావు, ఎం.ఎస్‌.నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌, శుభలేఖ సుధాకర్‌, భరత్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.

    English summary
    Naga Chaitanya’s Oka Laila Kosam is finally releasing on 17th of this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X