twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రైట్స్ కోసం ట్రై చేస్తున్న రాజమౌళి

    By Srikanya
    |

    హైదరాబాద్ : రాజమౌళి ప్రస్తుతం భారీగా 'బాహుబలి' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తదనంతరం ఆయన ఏం చిత్రం చేస్తారు...ఎలాంటి సినిమా అదీ అన్న దానికి ఓ క్లారిటీ వచ్చినట్లే. తాజాగా ఆయన మహాభారతం నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఆలోచన ఎప్పటి నుంచో రాజమౌళికి ఉన్నదే. అయితే ఇప్పుడు అందుకు సంపూర్తిగా తగిన ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది.

    కన్నడలో పాఠకాదరణ పొందిన 'పర్వ' అనే నవల ఆధారరగా రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నవలను ఎస్‌.ఎల్‌.భైరప్ప రచించారు. మహాభారత యుద్ధాన్ని మరో కోణంలో ఆవిష్కరించిన రచన ఇది. ప్రస్తుతం 'పర్వ' నవల హక్కుల కోసం రాజమౌళి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

    'Parva' is the next project of Rajamouli?

    కథ ఏదైనా సరే, దానికి భారీతనం, సాంకేతిక హంగులు జోడించడం ఎస్‌.ఎస్‌.రాజమౌళికి అలవాటైన విద్యే కాబట్టి ఈ చిత్రాన్ని భారీగా...అపరిమితమైన బడ్జెట్ తో అద్బుతంగా తీర్చిదిద్దాలని రాజమౌళి కల అన్నట్లు చెప్తున్నారు. సురేష్ బాబు ఈ ప్రాజెక్టుకు పూర్తి స్ధాయిలో సహాయసహకారాలు అందిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రం మొదలైతే తెలుగులో స్టార్ హీరోలను చాలా మందిని ఒకే సినిమాలో చూసే అవకాసముందని చెప్తున్నారు.

    English summary
    Rajamouli will do a film based on the novel titled ‘Parva’ after the completion of Baahubali flick. The novel ‘Parva’ was written by the well-known Kannada writer Bhairappa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X