twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ సీరియస్...ఇచ్చిన టైం అయిపోయింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అలాగే లక్కీ హ్యాండ్ అని తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ ని వైవియస్ చౌదరి చేతిలో పవన్ పెట్టారు. అయితే ఎప్పటికీ ఆ చిత్రం రిలీజ్ కావటం లేదు. ఎప్పుడో షూటింగ్ పూర్తైన ఈ చిత్రం రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అక్టోబర్ 2010లో మొదలైన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాకపోవటంతో పవన్ చాలా సీరియస్ అవుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మొదటనుంచీ సాయి ధరమ్ తేజ భాధ్యత తనదిగా పవన్ భావించారని కానీ ఇలా అతని లాంచింగ్ ఇంత లేటవుతుందని ఆయన ఊహిచంలేదని అంటున్నారు.

    ఇక రేయ్ చిత్రం విడుదల ఆగటానికి ఎన్ని కారణాలు చెప్పినా ఫైనాన్సియల్ ఇబ్బందులే అసలు రీజన్. వైవియస్ చౌదరి గత చిత్రాల బాకీలు...ఈ చిత్రం విడుదలకు అడ్డం పడుతున్నాయని అంటున్నారు. చిత్రం విడుదల చేయాలంటే అవి క్లియర్ చేయాలని ఫైనాన్సియర్స్ అడుగి,అడ్డుపడుతున్నారని ట్రేడ్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. దాంతో ఎప్పటికి ఆ బాకిలు తీరి, ఈ సినిమా రిలీజ్ అయ్యేను అంటున్నారు. సాయి ధరమ్ తేజ తర్వాత చేసిన చిత్రాలల్లో ఏదో ఒకటి విడుదల అయ్యి హిట్టైతే ఈ చిత్రం బిజినెస్ జరిగి విడుదల అవుతుందని అంటున్నారు.

     Pawan Kalyan Angry on YVS Chowdary?

    వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారైంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.

    ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

    చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తీసుకువస్తున్నారు. చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

    English summary
    The constant delays of the release of Rey, the debut film of his nephew Sai Dharam Tej, is reason behind Pawan's anger.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X