twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ రికార్డుని పవన్ బ్రద్దలు కొట్టాడు

    By Srikanya
    |

    హైదరాబాద్: సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హీరోల అభిమానుల మధ్య విచిత్రమైన సంవాదాలు జరుగుతూంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్...ట్విట్టర్ లో మహేష్ రికార్డుని బ్రద్దలుకొట్టారంటూ పోస్ట్ లు పడుతున్నాయి. అయితే అది ఎలా అంటే....మహేష్ బాబు కేవలం ఒక్కరినే తన బావ గల్లా జయిదేవ్ ని మాత్రమే ట్విట్టర్ లో ఫాలో చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్...ఒక్కరిని కూడా ట్విట్టర్ లో ఫాలో చేయటం లేదని. అయితే మహేష్ ఫ్యాన్స్ కొందరు... కేవలం మహేష్ ట్విట్టర్ లో కొద్ది రోజుల క్రితమే చేరాని అప్పుడే ఆయన ఎవరినీ ఫాలో చేయటం లేదని ఎలా నిర్ణయానికి వస్తారు అంటున్నారు. ఇలా సరదాగ ఈ అభిమానుల మధ్యన కామెంట్ల వాదం జరుగుతోంది.

    https://www.facebook.com/TeluguFilmibeat

    పవన్ కళ్యాణ్ తన అభిమానులతో డైరెక్ట్ గా టచ్ లో ఉండడం కోసం సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు. న్యూ ఇయర్ కానుకగా ఆయన ట్విట్టర్ లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. అలా అకౌంట్‌ ప్రారంభించారో , లేదో వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ విషయాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేశారు. పవన్ కు ఫాలోవర్లు నిమిష నిమిషానికీ పెరగడం మొదలుపెట్టారు.

    Pawan Kalyan Breaks Mahesh Babu's Record

    పవన్ కళ్యాణ్ వేసిన మొదటి ట్వీట్ ‘మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ శాంతి, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని' ట్వీట్ చేసాడు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లోకి ఎంటర్ అవ్వడంతో ఇందాస్త్రీలోని సెలబ్రిటీలు అందరూ ఆయనకి సోషల్ నెట్వర్క్ లోకి స్వాగతం పలికారు. అలాగే అభిమానులు ఎంతో అనడంతో #PawanKalyanOnTwitter అంటూ ఇండియాలో ట్రెండ్ చేస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లోకి ఎంటర్ అయిన కొద్ది గంటల్లోనే పవన్ కళ్యాణ్ కి లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు.

    తెలుగు రాష్ట్రాలకు పవన్ ఫీవర్ పట్టుకుంది. ఎన్నికల కంటే ముందు కేవలం నటుడిగా మాత్రమే ముద్ర పడిన పవన్ కళ్యాణ్ తరువాత రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందడం విశేషం. ఆయన కాలు కదిపినా, నోరు తెరిచినా సంచలనమే.. చివరకు ట్విట్ చేసినా సంచలనమేనని స్పష్టం అవుతోంది.

    పవన్ కు యూత్ లో విపరీతమైన క్రేజున్నా ఇంతవరకు వాడుకోలేదు. ఇప్పుడు కూడా దూరంగానే ఉండేవారు కాకపోతే రాజకీయాల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ అక్కౌంట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభినందించడానికైనా, ప్రశ్నించడానికైనా, విమర్శించడానికైనా ట్విట్టరు మంచి వేదిక అవుతుంది. ఒక వేళ మీడియా ఏదైనా వక్రీకరించినా ఎవరైనా విమర్శలు చేసిన ట్విట్టరు ద్వారా సమయం వృథా కాకుండా ఒక్కమాటలో సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. అందుకే సమీప మిత్రుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ ట్విటరులోకి అడుగుపెట్టారు.

    English summary
    Mahesh Babu follows only one person in Twitter and that is his brother-in-law Galla Jayadev. While that is one side, Pawan has beaten Mahesh given the fact that he is not even following even one person.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X