Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిజమైతే హరీష్ శంకర్ లక్కీనే
హైదరాబాద్: 'గబ్బర్ సింగ్'తో పవన్ కళ్యాణ్ కి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. ఆ తర్వాత ఆయన రామయ్యా వస్తావయ్యా తో డిజాస్టర్ ఫ్లాప్ ని ఇచ్చారు. గబ్బర్ సింగ్ తో ఓవర్ నైట్ లో స్టార్ డైరక్టర్ హోదా సంపాదించిన హరీష్ ఆ సినిమా పరాజయంతో తర్వాత పెద్ద ఆఫర్స్ సంపాదించలేకపోయారు. అయితే ఆయన మళ్లీ పవన్ కళ్యాణ్ ని కథతో ఒప్పించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రీసెంట్ గా కథ,స్క్రీన్ ప్లే తో పవన్ ని మెప్పించారనవి, వచ్చే సంవత్సరం ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాసముందని వినపడుతోంది. ఖచ్చితంగా ఈ వార్త నిజమైతే హరీష్ శంకర్ లక్కీనే.
ఇక రామయ్యవస్తావయ్యా ఫ్లాప్ తో డేట్స్ ఇస్తారనుకున్న పెద్ద హీరోలు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపధ్యంలో హరీష్...సాయి ధరమ్ తేజ తో చిత్రం మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. త్వరలో ప్రారంభం కాబోయే ఈ చిత్రానికి లొకేషన్స్ నిమిత్తం యుఎస్ వెళ్లారు. సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ విషయానికి వస్తే...ఆయన ఇప్పుడు 'గబ్బర్ సింగ్ 2' విషయంలోనూ తన ఆలోచనల్ని జోడించే పనిలో ఉన్నారు. 'గబ్బర్ సింగ్' సీక్వెల్‌కి రంగం సిద్ధమవుతోంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకుడు. 'గబ్బర్ సింగ్ 2' స్క్రిప్టు విషయంలో పవన్ చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో 'పెన్ను' చేసుకొంటున్నాడు. ప్రస్తుతం 'గోపాల గోపాల' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు పవన్.
ఈ మల్టీస్టారర్ పూర్తవ్వగానే 'గబ్బర్ సింగ్ 2'కి కాల్షీట్లు కేటాయించనున్నాడు. అక్టోబర్ ద్వితీయార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా.. పవన్ దగ్గరుండి స్క్రిప్టు పనులు చూసుకొంటున్నాడు. మరోవైపు కథానాయిక, సాంకేతిక నిపుణుల ఎంపికా జరుగుతోంది. పవన్ సరసన కథానాయిక ఎవరనే సంగతి ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.