twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభుత్వం కంటే పవన్ కళ్యాణే ఎక్కువా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హుధూద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నం సిటీతో పాటు చుట్టుపక్కల జిల్లాలు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ఎవరికి తోచిన సహాయం వారు చేసారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులంతా భారీగా విరాళాలు అందించారు. ప్రధాని మోడీ విశాఖలో పర్యటించారు. 1000 కోట్లు సహాయం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు 400 కోట్లు మాత్రమే విడుదల చేసారు.

    కాగా...తెలుగు సినిమా పరిశ్రమ నుండి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అత్యధికంగా రూ. 50 లక్షలు సహాయం అందించి అందరికంటే ముందు ఉన్నారు. స్వయంగా వెళ్లి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ విషయమై కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తూ తమ దృష్టిలో ప్రభుత్వం కంటే పవన్ కళ్యాణే ఎక్కువ సహాయం చేసారని అంటున్నారు.

    Pawan Kalyan highest individual contribution

    ప్రధాని మోడీ విశాఖలో పర్యటించి ప్రభుత్వం తరుపున సహాయం ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బును విరాళంగా ప్రకటించారు.....ఆయన సహాయ గుణం పరంగా చూస్తే ప్రభుత్వం కంటే ఎక్కువే చేసారు అని అంటున్నారు ఫ్యాన్స్. నిజమే...వారు చెబుతున్నదాంట్లోనూ పాయింటు ఉంది.

    ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన ‘గోపాలా గోపాలా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. దీని తర్వాత ఆయన గబ్బర్ సింగ్-2 చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నారు.

    English summary
    Pawan Kalyan fans are beaming over the fact that it was their favourite actor who was the first to reach the Hudhud place in person and also offer the highest individual contribution.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X