»   » 'సర్దార్ గబ్బర్ సింగ్' : స్టార్ హోటల్ లో , 1000 స్పెషల్ గిప్ట్స్ ,సీక్రెట్ గా

'సర్దార్ గబ్బర్ సింగ్' : స్టార్ హోటల్ లో , 1000 స్పెషల్ గిప్ట్స్ ,సీక్రెట్ గా

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ ప్రతిష్టాత్మకంగా రెడీ చేస్తున్న చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ చిత్రం ఆడియో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒక్క ప్రోమో తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆడియో ని మార్చి 20 న , సాయింత్రం విడుదల చేస్తున్నారని ప్రకటన ఆల్రెడీ వచ్చింది. అలాగే ఈ ఆడియోని స్టార్ హోటల్ నవోటెల్ లో చేయాలని నిర్ణయించారని సమాచారం.

బహుశ హైదరాబాద్ లో ని నోవాటెల్ హోటల్ లో జరుపుతారని వినికిడి. ఇదే కనుక నిజం అయితే అభిమానులకు నిరాశే మిగలోచ్చు. ఎందుకంటే అక్కడ అంతగా అందరికి ఎంట్రీ దొరకదనే టాక్ కూడా వుంది. కాకపోతే పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరు అవుతారని భావిస్తున్న ఈ వేడుక కోసం టీమ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: ఫొటోలు:పవన్ కి సాయి ధరమ్ తేజ బాడీగార్డ్ @సర్దార్ సెట్


'పవర్' ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను శరత్ మరార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సర్దార్, ఏప్రిల్ 8న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.


ఫ్యాన్స్ కు 1000 స్పెషల్ గిప్ట్స్ , ఇంకా మరెన్ని విశేషాలు..


గిప్ట్స్ లు

ఈ వేడుకలో తన అభిమానులు వెయ్యి మందికి పవన్ ప్రత్యేక గిప్ట్ లు అందించనున్నారని సమాచారం.


 


సీక్రెట్ గా...

గిప్ట్ ల విషయం నిర్మాత శరద్ మరార్ చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు.


టీ షర్టా, మెమెంటోనా

ఈ గిప్ట్స్ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది...అది టీ షర్టా లేక మెమంటోనా అన్నది తెలియాల్సి ఉంది.


 


ఆడియోకు

టాలీవుడ్ సినీ ప్రముఖులు .. మెగా ఫ్యామిలీ సమక్షంలో, ఈ ఆడియో వేడుక ఘనంగా జరగనున్నట్టు చెబుతున్నారు.


 


అదే ప్లేస్

'జనసేన' పార్టీ ఆవిర్భావం జరిగిన ఈ ప్రదేశంలోనే, 'సర్దార్' ఆడియో వేడుకను నిర్వహిస్తుండటం ఫ్యాన్స్ కి మరింత ఆనందాన్ని కలిగించే విషయం


రైట్స్

ఈ ఆడియో ఫంక్షన్ ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు గాను, రెండు టీవీ ఛానల్స్ హక్కులను పొందాయట.


 


కోటి వరకూ..

ఆడియో ఫంక్షన్ ను ప్రత్యక్ష ప్రసారం గాను ఆ రెండు టీవీ ఛానల్స్ కలిసి కోటి రూపాయల వరకూ చెల్లించాయనే టాక్ వినిపిస్తోంది.


 


రాత్రింబవళ్లూ..

ఏప్రిల్ 8న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ముందుగానే చెప్పారు గనుక, ఆ రోజున ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో రాత్రింబవళ్లూ పని చేస్తున్నారు.


 


నిజమా

6 రోజుల్లోనే 3 పాటలను పూర్తి చేయాలని టీమ్ తో పవన్ చెప్పారని, ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


 


ప్రస్తుతం పవన్ ..

హైద్రాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో ఇంట్రో సాంగ్ కోసం వేసిన ప్రత్యేక సెట్స్‌లో పవన్ స్టెప్పులేస్తున్నారు.


 


అలాంటిదే

గబ్బర్ సింగ్ క్యారెక్టరైజేషన్‌ను బేస్ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమాలోనూ ఇంట్రో సాంగ్, అలాంటిదే మరింత ఊపుతో ఉంటుందని తెలుస్తోంది.


 


ఫినిష్ చేసి...

మరో రెండు రోజుల్లో ఈ సాంగ్‌ను పూర్తి చేసి టీమ్ మొత్తం 20న జరిగే ఆడియో రిలీజ్‌కు సిద్ధమవుతోంది.


 


రెండు పాటలకోసం..

ఆడియో పంక్షన్ తర్వాత మరో రెండు పాటల కోసం సర్దార్ టీమ్ స్విట్జర్లాండ్ వెళ్ళనుంది.


 


అదే ఆఖరి షెడ్యూల్

స్విట్జర్లాండ్ షెడ్యూల్‌తో ఈ సినిమా పూర్తవుతుంది.


 


ఒకేసారి

ప్రొడక్షన్‌తో పాటే సమాంతంగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుకుంటోంది.


 


టీమ్ కు స్పెషల్ గా

రాత్రిబవళ్లూ కష్టపడుతున్న టీమ్ కు లంచ్ .. డిన్నర్ .. ఏర్పాట్లను కూడా పవన్ చూసుకుంటున్నాడట.


 


ఎవరికి ఇష్టమైంది..

టీమ్ లో వెజ్ .. నాన్ వెజ్ .. ఇలా ఎవరికి ఇష్టమైన భోజనం వారికి అందేలా ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడని అంటున్నారు.


 


యువరాణి

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కాజల్ 'రతన్ పూర్' యువరాణి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.


 


ప్యాలెస్ లో

కొంతకాలం క్రితం కాజల్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఒక ప్యాలెస్ లో చిత్రీకరించారు.


మగధీర తర్వాత

'మగధీర' తరువాత యువరాణిగా ఈ సినిమాలో కాజల్ కనిపించబోతుండటంతో అందరిలో ఉత్సాహం కనిపిస్తోంది.


 


English summary
Buzz has that Pawan Kalyan is planning to gift unique gifts to at least 1000 fans from "Sardaar Gabbar Singh" audio venue.
Please Wait while comments are loading...