twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫొటో: పవన్ కళ్యాణ్ భుజంపై టిడిపి కండువా

    By Srikanya
    |

    హైదరాబాద్ : స్టార్ హీరో‌, కేంద్రమంత్రి చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీలో లోకి ఎంట్రీ ఇస్తారా? ఇప్పుడు చాలా మందిలో ఇదే ప్రశ్న. దానికి తోడు గత కొద్ది రోజులుగా తెలుగుదేశం కండువా కప్పుకున్న పవన్ కళ్యాణ్ ఫోటో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో జోరుగా తిరుగుతోంది. తాజాగా అత్తారింటికి దారేది సూపర్ హిట్ అయిన నేపధ్యంలో ఈ వార్త మరింత జోరు అందుకుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని చాలా ఏరియాల్లో వెహికల్స్ ఈ ఫోటో తో ప్రత్యక్ష్యమవుతున్నాయి. దాంతో 2014 లో వచ్చే జనరల్ ఎలక్షన్స్ లోకి పవన్...తెలుగు దేశం తరుపున నిలబడతాడనే ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు ఈ మధ్యన ఆయన రామోజీరావుని కలిసారని చెప్పుకుంటున్నారు. తెలుగు దేశం సపోర్టర్స్ చాలా మంది ఈ ఫోటోని విరివిగా ప్రచారం చేయటం గమనార్హం. ఆ ఫొటో గుట్టు ఏమిటో తేలాల్సి ఉంది.

    మరో ప్రక్క పవన్ కళ్యాణ్ మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నారంటూ ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో సినిమాలకు దూరంగా ఉండి, చాలా సమయం రాజకీయాలకే కేటా యించిన పవన్ చాలా స్పీడుగా వ్యవహరించి..కాంగ్రేస్ ని దుమ్మెత్తి పోసారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ నేతలను పంచెలు ఊడదీసి తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. ప్రసంగాలలో కాంగ్రెస్‌పై చండ్రనిప్పులు కక్కారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు. దానిని పవన్‌ తీవ్రంగా వ్యతిరేకించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి నుంచీ పవన్ కి,చిరు కి రిలేషన్స్ సరిగ్గా లేవంటూ చెప్పుకున్నారు. అయితే అలాంటిదేమీ లేదని తరుచూ ఖండిస్తూనే వస్తున్నారు.

    మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఓ నిబధ్ధతతో ఉన్న వ్యక్తి. తను నమ్మిన సిద్దాంతం కోసం ...ముక్కుసూటిగా మాట్లాడటం, ఏ విధమైన వేరు ఆలోచన లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు ఎవరేమనుకున్నా సరే రీతిలో వ్యక్తీకరించడం, వామపక్ష భావజాలంతో పాటు, ఇతర హీరోలకు విభిన్నంగా మానవీయ విలువలున్న వ్యక్తిగా పవన్‌కల్యాణ్‌ కు మంచి పేరుంది.ఆయన అభిమానులు సైతం ఆయన సిద్దాంతాలను పవనిజం పేరట ప్రచారం చేస్తూ వస్తున్నారు. దాంతో అంత ప్రజాకర్షణ గల నటుడు ని నాయకుడు చేయాలని భావించటంలో వింతేమీ లేదు.

    ఎలక్షన్స్ వ్యూహంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ...ఆయన వైపు చూస్తున్నారన్న ప్రచారం సినీ- రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆ మధ్యన బాలకృష్ణ ఆ మేరకు రాయబారం నిర్వ హించినట్లు చెప్పుకున్నారు. స్వయంగా బాలకృష్ణ పవన్‌ను వెంటబెట్టుకుని చంద్ర బాబుతో చర్చలు జరిపారని, ఆ మేరకు టీడీపీలో చేరేందుకు పవన్‌ కల్యాణ్‌ సుముఖత వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు ఈ కండువాతో పవన్ కనిపించటం...మార్ఫింగ్ వ్యవహారమే అయినా ఎక్కడా ఖండన రాకపోవటంతో ..పవన్ మౌనం అంగీకారమేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.

    English summary
    Pawan Kalyan wearing Telugu Desam party kanduva may stun all of us. But currently this one adorns all the vehicles of Telugu Desam partymen in Andhra Pradesh. There have been rumors that powerstar Pawan Kalyan would join Telugu Desam party just before the 2014 general elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X