twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ సరసన నయనతార ఓకే కానీ, కథ మాత్రం ఎన్టీఆర్ ఫ్లాఫ్ సినిమాకు ఓ వెర్షన్ అంటున్నారే

    By Srikanya
    |

    హైదరాబాద్ : హీరోల వయస్సు పెరిగే కొలదీ వాళ్లకు తగ్గ హీరోయిన్స్ దొరక్క సమస్య ఏర్పడుతూంటుంది. కానీ పవన్ పరిస్దితి వేరు. ఆయన ప్రక్కన నటించటానికి యంగ్ హీరోయిన్స్ అంతా ఉత్సాహం చూపిస్తూంటారు. దాంతో ఆయనకు ఇన్నేళ్లలో ఎప్పుడూ హీరోయిన్ దొరకలేదు అనే సమస్య ఎదురుకాలేదు.

    ఇక సిని పరిశ్రమలో గమ్మత్తైన రూల్ ఉంది హీరోల వయస్సు ఎంతైనా వారు హీరోలుగా కొనసాగుతూంటారు. అయితే హీరోయిన్స్ మాత్రం కొద్ది వయస్సు దాటి, సీనియార్టి వచ్చేయగానే వాళ్లు రిటైర్ అయ్యిపోవాల్సిన పరిస్దితి. ఎక్కడో నయనతార లాంటివాళ్లు దాన్ని దాటగలుగుతున్నారు. దాంతో వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నిర్మాత ఎ. ఎం రత్నానికి వచ్చిందిట.

    రీసెంట్‌గా పవన్ హీరోగా ఎ.ఎం.రత్నం ఓ మూవీ ని పట్టాలెక్కించారు. రెండురోజుల కిందట అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. తమిళ దర్శకుడు 'నేసన్' ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో పవన్‌.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్లు టాక్. అందులో ఒకరిగా నయనతారను ఎంచుకున్నారట. ఈ విషయమై నయనతారని మేకర్స్ సంప్రదించడం, ఆమె దాదాపుగా ఓకే చేసినట్టు కోలీవుడ్ సమాచారం. మరో ప్రక్క ఈ చిత్రం ఎన్టీఆర్ తెలుగు నటించి ప్లాఫైన చిత్రానికి అనుకరణ గా వచ్చిన తమిళ సినిమాకు రీమేక్ అని వినపడుతోంది. మరిన్ని వివరాలు క్రింద చదవండి.

    మరొక హీరోయిన్ కి అవకాసం

    మరొక హీరోయిన్ కి అవకాసం

    కథ ప్రకారం మరో హీరోయిన్ కూడా వున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ విషయమై కొంతమంది బ్యూటీలతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నటీనటుల ఎంపిక ఓకే కాగానే సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. వీలైతే సమ్మర్‌కి రిలీజ్ చేయాలని స్కెచ్ వేస్తున్నాడు రత్నం.

    తమిళ దర్సకుడుతో...

    తమిళ దర్సకుడుతో...

    పవన్‌కల్యాణ్‌ హీరోగా శ్రీ సాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఆర్‌.టి.నేసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌.ఐశ్వర్య నిర్మాత. ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. విజయదశమి రోజున హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

    మాస్ సినిమా ఇది

    మాస్ సినిమా ఇది

    'తమిళంలో 'జిల్లా' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్న దర్శకుడు ఆర్‌.టి.నేసన్‌. పవన్‌కల్యాణ్‌ శైలి మాస్‌ అంశాలతో ఓ మంచి కథని సిద్ధం చేశారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఆ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని త్వరలోనే తెలియజేస్తామ''ని చిత్రవర్గాలు తెలిపాయి.

    నేసన్ పై నమ్మకంతో...

    నేసన్ పై నమ్మకంతో...

    ఈ కార్యక్రమంలో పవన్‌కల్యాణ్‌, ఎ.ఎం.
    రత్నం, శరత్‌ మరార్‌, జ్యోతికృష్ణ, ఆర్‌.టి. నేసన్‌, ఎ.ఎం. రత్నం సోదరుడు దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు. శ్రీసాయిరామం క్రియేషన్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య మూవీస్‌ అధినేత ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, టెక్నీషియన్స్‌ వివరాలను తెలియజేస్తామని చిత్ర బృందం తెలిపింది.

    ఇదీ రీమేకే

    ఇదీ రీమేకే

    గతంలో పలు తమిళ చిత్రాలను రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారాయన. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న 'కాటమరాయుడు' కూడా తమిళ చిత్రం 'వీరమ్'కి రీమేకే. తాజాగా మరో తమిళ రీమేక్‌కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన 'వేదాళం' తెలుగు రీమేక్‌లో నటించడానికి అంగీకరించారాయన.

    ఐదోసారి ఇలా...

    ఐదోసారి ఇలా...

    తమిళ దర్శకులంటే మన హీరోలకు బాగా గురి. కథని స్టైలీష్‌గా తెరకెక్కిస్తారని వాళ్ల నమ్మకం కావొచ్చు. పవన్‌ కల్యాణ్‌ కూడా తమిళ దర్శకులకు తరచూ అవకాశాలిస్తుంటాడు. ఇప్పటివరకూ దర్శకులు కరుణాకరన్, ఎస్.జె.సూర్య, ధరణి, విష్ణువర్ధన్‌ల తర్వాత పవన్‌కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న తమిళ దర్శకుల్లో ఆర్.టి.నేసన్ ఐదో వ్యక్తి.

    ఇదే బ్యానర్ లో గతంలో

    ఇదే బ్యానర్ లో గతంలో

    ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ - ''పవన్‌కల్యాణ్‌తో మూడో చిత్రమిది. సూర్య మూవీస్ పతాకంపై 'ఖుషి', 'బంగారం' చిత్రాలు నిర్మించాం. నా పర్యవేక్షణలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య నిర్మిస్తున్న 4వ చిత్రమిది. కమర్షియల్ ఎంటర్‌టైనర్. త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం'' అన్నారు.

    కథలో మార్పులు చేసే..

    కథలో మార్పులు చేసే..

    ''పవన్ ఇమేజ్‌కి తగ్గట్టు 'వేదాళం' కథలో మార్పులు చేశాం'' అన్నారు దర్శకుడు ఆర్.టి.నేసన్. ఇప్పుడు ఎస్‌.జె.సూర్యతో ఓ సినిమా మొదలెట్టిన పవన్‌, ఈ సినిమా పూర్తయ్యాక మళ్లీ తమిళ దర్శకుడితోనే జట్టు కట్టనున్నాడు. అతనే... నేసన్‌. విజయ్‌తో 'జిల్లా' తీసి హిట్‌ డైరెక్టర్‌ అనిపించుకొన్నాడు. ఇప్పుడు తనతోనే పవన్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. అదీ రీమేక్‌ కథ. అజిత్‌ హీరోగా నటించిన 'వేదాళం' తమిళంలో మంచి విజయం సాధించింది. ఇప్పుడా చిత్రాన్ని తెలుగులో పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కించనున్నారు. దీనికి నేసన్‌ దర్శకత్వం వహిస్తారు.

    ఎన్టీఆర్, చిరుకు అనుకున్నారు కానీ..

    ఎన్టీఆర్, చిరుకు అనుకున్నారు కానీ..

    తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత ఆ స్ఠాయి మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో అజిత్. గత సంవత్సరంలో తమిళంలో స్టార్ హీరో అజిత్ నటించిన వేదాలం యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ చిత్రం గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో డైరెక్ట్ గా డబ్ చేయకుండా రిమేక్ చేయాలనే ఉద్దేశ్యంతో తెలుగులో ఈ సినిమా రాలేదు. ఆ మద్య ఈ చిత్రం తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు నటించాలని ప్రయత్నించినా అది ఆచరణలోకి రాలేదు. ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కన్నేసినట్లు తెలుస్తుంది

    మాట నిలబెట్టుకోవాలనే

    మాట నిలబెట్టుకోవాలనే

    నిర్మాత ఎ. ఎమ్. రత్నంకు ఇచ్చిన మాటకోసమే ఈ సినిమా ఓకే చేసారు అని ఫిలింనగర్ లో వినపడుతోంది. పవన్ కళ్యాణ్ కెరియర్ ను ఒక మలుపు తిప్పిన 'ఖుషి' సినిమాను ఎ.ఎమ్ రత్నం నిర్మించిన దగ్గర నుండి ఈనిర్మాత అంటే పవన్ కు ఎంతో అభిమానం. ఆ తరువాత పవన్ రత్నం నిర్మించిన 'బంగారం' సినిమాలో నటించినా ఆ సినిమా ఫెయిల్ కావడంతో ఎ.ఎమ్. రత్నం నష్ట పోయాడు. ఆ తరువాత ఈ నిర్మాత మరిన్ని సినిమాలు తమిళంలో తీసి ఆర్ధికంగా బాగా నష్టపోయాడు. ఆ పరిస్థుతులలో రత్నంను ఆదుకుంటానని పవన్ అప్పట్లోనే మాట ఇచ్చాడు అని టాక్. ఇప్పడది నిలబెట్టుకుంటున్నాడని చెప్తున్నారు.

    ఎన్టీఆర్ ఫ్లాఫ్ చిత్రంలాంటి కథనే

    ఎన్టీఆర్ ఫ్లాఫ్ చిత్రంలాంటి కథనే

    వేదాలం సినిమాకీ తెలుగులో ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాకి చాలా దగ్గరి పోలికలున్నాయనేది రెండు సినిమాలు చూసిన వారు చెప్పే విషయమే. ఊసరవెల్లి తెలుగులో అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇలాంటి వేదాలంని రీమేక్ చేస్తే ఏం బాగుంటుందనేది పవన్ అభిమానుల ఆలోచన. కానీ వేదాలం సినిమాని చూసిన పవన్ కళ్యాణ్ ముచ్చటపడిపోయాడట. అందుకే వెంటనే ఆసినిమాని రీమేక్ చేయాలని డిసైడైయ్యాడని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇదివరకటి ఊసరవెల్లి చూడలేదా? లేక ఆ కథలో మరో యాంగిల్ లో ఆయన చూశాడా అన్నది తెలియాల్సి వుంది. అయితే పవన్ ఏదైనా రీమేక్ చేస్తే దాన్ని పక్కాగా తెలుగు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయిస్తుంటారు. కాబట్టి మంచి మార్పులతోనే తెరకెక్కే అవకాసం ఉంది.

    సినిమాలో చెల్లి సెంటిమెంట్

    సినిమాలో చెల్లి సెంటిమెంట్

    అజిత్ వేదాలం' సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే సినిమా. మాస్ మసాలా అంశాలకు కొదవుండదు. భారీగా యాక్షన్ ఉంటుంది. సొంతంగా ఓ బ్లాక్ బస్టర్ తీసిన ఓ తమిళ దర్శకుడు.. మరో బ్లాక్ బస్టర్ మూవీని తెలుగు హీరోతో రీమేక్ చేయాలనుకోవడంతో సినిమాపై అంచనాలు ఖచ్చితంగా పెరుగుతున్నాయి.

    English summary
    After the remake of Veeram , Pawan will also feature in the remake of another Tamil movie Vedhalam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X