twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పికె’ వివాదం: 8 కోట్లు ఇచ్చి ఆపమన్నారట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పికె' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు 26 కోట్లకు పైగా వసూలు చేసిన ఈచిత్రం రూ. 100 కోట్లకు చేరువైంది. ఈ చిత్రం టోటల్ బిజినెస్ రూ. 200 కోట్లు దాటుతుందని అంచనా.

    ఈ చిత్రంలో అమీర్ ఖాన్ ఎంట్రీ నగ్నంగా, విచిత్రంగా ఉంటుంది. ఆయన ఇందులో భోజ్‌పురి మాట్లాడే ఆస్ట్రోనాట్‌గా కనిపించారు. ఇండియాలోని మత వ్యవస్థపై సైటైర్లు వేస్తూ ఈ సినిమా సాగింది. అయితే తాజాగా ఈ చిత్రంపై ఓ వివాదం నెలకొంది. ఈచిత్రం సెకండాఫ్ గతంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓహ్ మై గాడ్' సినిమాను పోలిఉందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

    PK team offered 8 crores to Umesh Shukla

    ‘ఓ మై గాడ్' చిత్ర సబ్జెక్టు ‘పికె'కు సమీపంగా ఉండటంతో....రెండేళ్ల క్రితం ‘ఓ మై గాడ్' చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు సినిమా ఆపి వేయాలని దర్శకుడు ఉమేష్ శుక్లాను అమీర్ ఖాన్, విధు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరానీ కలిసారని, రూ. 8 కోట్లు కూడా ఆఫర్ చేసారని తెలుస్తోంది.

    అయితే ఉమేష్ శుక్లా....వారి మాట వినకుండా, డబ్బు తీసుకోకుండా సినిమాను కంప్లీట్ చేసాడు. తర్వాత ఓ మై గాడ్ చిత్రం పెద్ద హిట్టయింది. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది.

    English summary
    Bollywood sources informed that, When Oh My God was still under making, Aamir Khan, Vidhu Vinod Chopra and Raju Hirani offered 8 crores to director Umesh Shukla and asked him to stop the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X