Don't Miss!
- News సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న కవిత: ఎందుకంటే?
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
బాలకృష్ణ 99 చిత్రం టైటిల్ ఏంటంటే
హైదరాబాద్ : : నందమూరి బాలకృష్ణ 99వ చిత్రానికి స్క్రిప్ట్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లయన్ చిత్ర షూటింగ్ లో ఉండగానే తదుపరి ప్రాజెక్టుకు బాలయ్య ఓకే చెప్పారు. ఈ సినిమాకు రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ లు మాటలు అందిస్తున్నారు. లక్ష్యం వాసు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. గతవారమే ఈ కథను బాలకృష్ణ ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే లయన్ పూర్తి అయిన తరువాత బాలయ్య 99 వ చిత్రం సెట్స్ పై కి వెళ్లనుంది. ఈ చిత్రానికి ‘డిక్టేటర్'అనే టైటిల్ ని పెట్టే అవకాసముందని తెలుస్తోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఆ మధ్యన బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి లౌక్యం చిత్రాన్ని స్పెషల్ షో చూడటం జరిగింది. ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఓ వినోదాత్మకమైన చిత్రం చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తన అభిమానులను నిరాశపరచకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా సరైన స్దానం స్క్రిప్టులు ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్టు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య తాజా చిత్రం విషయానికి వస్తే...
బాలయ్య 'లయన్' చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'లెజెండ్' లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 'లయన్' చిత్రంలో కూడా బాలయ్య యాక్షన్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకోబోతున్నాడు. సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టీజర్‌ని బుధవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేశారు. ఇందులో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. బాలయ్య 'కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది. మరికొందరుకొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
నిర్మాత మాట్లాడుతూ.. '''లెజెండ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ మా సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన కథను సత్యదేవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రంతో తను అగ్ర దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నిర్మాణ విలువలతో మేం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.'' అని చెప్పారు.
'లెజెండ్' తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగ్గట్టుగానే అత్యంత శక్తిమంతంగా ఇందులోని బాలయ్య పాత్ర ఉండబోతోందని వినికిడి. సత్యదేవ్ సంభాషణలు కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయని సమాచారం. గన్ నుంచి విడుదలయ్యే బుల్లెట్‌కి దయా దాక్షిణ్యాలుండవ్. దానికి తెలిసిందల్లా లక్ష్యం ఒక్కటే. దాన్ని ఛేదించేదాకా అది వదలదు. ఈ లక్షణాలతో ఓ పాత్రను సృష్టిస్తే? ఆ పాత్రను బాలకృష్ణ పోషిస్తే? ఇక అభిమానులకు అంతకంటే కావల్సిందేముంటుంది! సత్యదేవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలకృష్ణ అలాగే కనిపించనున్నారని చెప్తున్నారు.
బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.