twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్‌కి కౌంటర్: ‘జన గణ మన’ విషయంలో పూరి షాకింగ్ నిర్ణయం!

    ‘జన గణ మణ’ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా తెరకెక్కించేందుకు పూరి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేశ భక్తికి సంబంధించిన కాన్సెప్టు కావడం, తన ఏజ్ కి సరిపోయే సబ్జెక్ట్ కావడంతో వెంకీ ఆసక్తిగా న్నారట.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: న్యూఇయర్ శుభాకాంక్షలతో పాటు ఈ సంవత్సరం తాను చేయబోయే సినిమాల వివరాలు కూడా మహేష్ బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న మహేష్ బాబు 2017లో కొరటాల శివ, వంశీ పైడిపల్లి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.

    ఈ సినిమాలు ప్రకటించడం ద్వారా మరో రెండున్నర మూడేళ్ల వరకు తాను బిజీ అని చెప్పకనే చెప్పాడు మహేష్ బాబు. ఇప్పటికే మహేష్ బాబు పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ మూడో సినిమాగా 'జన గణ మన' చేయాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు.

    మహేష్ బాబు షాకిచ్చాడు

    మహేష్ బాబు షాకిచ్చాడు

    ఇప్పటికే మహేష్ బాబుకు పూరి కథ వినిపించాడు. మహేష్ బాబు కథ నచ్చిందని చెప్పాడు కానీ డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. ఇలా తనను వెయిట్ చేయించడంపై ఆ మధ్య పూరి అసహనం వ్యక్తం చేసారు కూడా. మహేష్ బాబు తాజా ప్రకటనతో ‘జన గణ మన' ఆయనతో చేసే అవకాశం లేదని డిసైడైన పూరి.... వేరే హీరోతో ఆ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

    వెంకటేష్ హీరోగా.... జన గణ మన

    వెంకటేష్ హీరోగా.... జన గణ మన

    ‘జన గణ మణ' చిత్రాన్ని వెంకటేష్ హీరోగా తెరకెక్కించేందుకు పూరి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేశ భక్తికి సంబంధించిన కాన్సెప్టు కావడం, తన ఏజ్ కి సరిపోయే సబ్జెక్ట్ కావడంతో వెంకీ ఆసక్తిగా న్నారట.

    వెంకీ, సురేష్ బాబు నిర్మాతలుగా?

    వెంకీ, సురేష్ బాబు నిర్మాతలుగా?

    వెంకటేష్, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 45 కోట్ల వ్యయంతో భారీగా ఈ సినిమాను తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

    ఎవరు ఎంత?

    ఎవరు ఎంత?

    రూ. 45 కోట్ల బడ్జెట్ లో వెంకటేష్ రూ. 25 కోట్లు, సురేష్ బాబు రూ. 20 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

    English summary
    Puri is mulling to cast Venkatesh as lead in 'Jana Gana Mana'. Venkatesh and D Suresh Babu are jointly producing this high-budget venture. As the estimated budget is Rs 45 crore, Venky & Suresh Babu will invest Rs 25 crore and Rs 20 crore each respectively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X