twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందీలోంచే ఎత్తుకొచ్చి...మళ్లీ హిందిలోకే

    By Srikanya
    |

    /news/andhra-pradesh/ktr-retaliates-ponnala-harish-fires-tdp-141659.html
    హైదరాబాద్ : ఒక భాషలో హిట్టైన సినిమాను మరో భాషలోకి డబ్బింగ్ లేదా రీమేక్ చేయటం చాలా సహజం. అందుకు డిమాండ్ కూడా బాగానే ఉంటుంది. అయితే ఆల్రెడీ హిందీ చిత్రం నుంచి కాపీ కొట్టారంటూ వివాదం ఎదుర్కొంటున్న చిత్రం...అదే హిందీలోకి డబ్బింగ్ రైట్స్ వెళ్లాయంటే మాత్రం ఆశ్చర్యమే. ఆ సినిమా మరేదో కాదు... సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా నటించి విడుదలైన చిత్రం 'రారా కృష్ణయ్య'. ఈ చిత్రం 'తేరే నాల్‌ లవ్‌ హోగయా' అనే బాలీవుడ్ చిత్రం కాపీ కొట్టారని,కోర్టుకు కూడా ఈ కేసు వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడదే హిందిలోకి డబ్ చేస్తూండటం ఫిల్మ్ సర్కిల్స్ లో ఆశ్చర్యం కలుగ చేస్తోంది.

    కృష్ణవంశీ శిష్యుడు మహేశ్‌ దర్శకుడిగా పరిచయమయిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అంతేకాకుండా కాపీ వివాదం మొదలైంది. ఈ కాపీ వివాదమే నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియా ద్వారా సమాధానమిచ్చుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రొఫెషనల్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత కె.కిషోర్‌ అనువదిస్తున్నారు.

    కె.కిషోర్‌ మాట్లాడుతూ... ''తెలుగులో ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన 'రారా కృష్ణయ్య' చిత్ర అనువాద హక్కులను తీసుకున్నాము. హిందీతోపాటు భోజ్‌పురి వంటి భాషలలో అనువదిస్తున్నాము. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. ఇందులోని ఆరు పాటలలో ఓ పాటను శ్రియా గోషాల్‌ పాడారు. ఈ సినిమాపై కొంతమంది రూమర్స్‌ క్రియేట్‌ చేసారు.

    'తేరే నాల్‌ లవ్‌ హోగయా' హిందీ రీమేక్‌ను తెలుగులో 'రారా కృష్ణయ్య'గా చిత్రాన్ని చేసారని రూమర్స్ సృష్టించారు. కానీ ఇది తప్పు అని, రారా కృష్ణయ్య చిత్రం హిందీ రీమేక్‌ కాదని తెలుగు నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్‌ (యస్‌వికె సినిమా) కన్‌ఫామ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సరికొత్త కాన్సెప్ట్‌తో నిర్మించారు కాబట్టి అనువాద హక్కులను పొందడం ఆనందంగా వుంది. సెప్టెంబర్‌లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాము'' అని అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ... రారా..కష్ణయ్య తరహాలో బాలీవుడ్‌లో ఇప్పటి వరకు చెన్నై ఎక్స్‌ప్రెస్, తేరే నాల్ లవ్ హోగయా వంటి తదితర చిత్రాలొచ్చాయి. అయితే గత కొన్నేళ్ల క్రితం స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ డానీ బోయెల్ రూపొందించిన ఏ లైఫ్ లెస్ ఆర్డినరీ చిత్రంలోని ఓ పాయింట్ స్ఫూర్తితో రారా..కష్ణయ్య చిత్రాన్ని రూపొందించాను. మనం ఏదైతే జరగకూడదని అనుకుంటామో అదే జరిగితే ఆ తరువాత మనం పడే సంఘర్షణ ఎలా వుంటుందన్న పాయింట్ నన్ను బాగా ఆ కట్టుకుంది. దాన్ని ప్రధాన కథావస్తునవుగా తీసుకుని ఈ సినిమా చేశాను. కొత్త పంథాలో సాగిన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది అన్నారు.

    English summary
    Sundeep Kishen,Regina starrer ‘Ra Ra Krishnayya’ makers are planning to dub the film in Hindi and other north Indian languages. K.Kishore is dubbing the film in these languages on Professional Creations banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X