twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమస్య ఉంది కానీ...ఎన్టీఆర్ ఒప్పుకోవటం లేదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : జూ. ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న 'రభస' సినిమా వాయిదా రూమర్స్ మీడియాలో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అది నిజమే అని ట్రేడ్ వర్గాల్లో చెప్తున్నారు. రన్ రాజా రన్ చిత్రం నైజాం ఏరియాలో మంచి హిట్ అయ్యి..రెవిన్యూలు ఉండటంతో ...'రభస' కోసం దానిని తీసేయటం ఇబ్బందికరమైన అంశమని, అది తీసేయకపోతే అల్లుడు శ్రీను తీసేయాల్సి వస్తుందని తెలుస్తోంది. ఈ రెండిటిలో ఏదో ఒకటైనా తీసేయకపోతే మంచి థియోటర్స్ 'రభస'కు దొరకవు. అందుకే ఈ వాయిదా ని దిల్ రాజు ప్రపోజ్ చేసాడని చెప్పుకుంటున్నారు.

    ఈ వాయిదాని...దిల్ రాజు సన్నిహితుడు శిరీష్ వెళ్లి ఎన్టీఆర్ ని కలిసి నిన్నరాత్రి వాయిదా ప్రపోజల్ పెట్టారని, ఈ నెలాఖురున విడుదల చేద్దామని అడిగారని చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్...తనపై నమ్మకంతో ఎదురుచూస్తున్న అభిమానులను ఇబ్బంది పెట్టినట్లుంటుంది ఓకే చెయ్యలేదని, ఇంకా ఈ విషయంపై ఆలోచనలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికీ ఫిప్టీ ..పిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పటివరకూ ఏదీ ఫైనలైజ్ కాలేదని అంటున్నారు.

    ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ పూర్తి ప్రాధాన్యత ఉందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

     Rabhasa Postponement Rumours

    దర్శకుడు మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ నుంచి రాబోతున్న మరో వినోదాత్మక యాక్షన్‌ తరహా చిత్రమిది. హీరో పాత్ర చిత్రణ, కథ నడవడిక వైవిధ్యంగా ఉంటాయి'' అన్నారు. అలాగే హీరోగా ప్రేక్షకుల మన్ననలను పొందిన ఎన్టీఆర్‌ ఇప్పుడు డ్యాన్స్‌ మాస్టర్‌ అవుతున్నారు. ఫిల్మ్‌నగర్‌లో ఇప్పుడు ఇదే టాక్‌. 'రభస' సినిమా ఇంట్రడక్షన్‌ పాట కోసం ఎన్టీఆర్‌ నృత్య రీతులు సమకూర్చారు.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    Dil Raju is suggesting a postponement Rabhasa considering the lack of Big No. of Theatres needed to put up a huge release as is the norm for Biggies. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X