twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి-2: రాజమౌళి రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు?

    బాహుబలి-2 కూడా రిలీజ్ కావడంతో.... అంతా ఇపుడు రాజమౌళి ఈ సినిమా తీయడానికి ఎంత తీసుకున్నారు అనేది హాట్ టాపిక్ అయింది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తెరెకెక్కించిన 'బాహుబలి-2' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా తొలి రోజు ఒక్క ఇండియాలోనే రూ. 120 కోట్లకుపైగా వసూలు చేసింది. విదేశాల్లోని కలెక్షన్స్ కూడా కలిపితే ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉండబోతోంది.

    ఓవరాల్ రన్‍‌లో 'బాహుబలి-2' వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇంత పెద్ద మొత్తం వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమాగా బాహుబలి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతోంది.

    బాహుబలి-2 కూడా రిలీజ్ కావడంతో.... అంతా ఇపుడు రాజమౌళి ఈ సినిమా తీయడానికి ఎంత తీసుకున్నారు అనేది హాట్ టాపిక్ అయింది.

    రాజమౌళి ఐదేళ్ల కష్టం

    రాజమౌళి ఐదేళ్ల కష్టం

    వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్లో నెం.1 దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి.... ‘బాహుబలి' ప్రాజెక్టు కోసం తన ఐదేళ్ల సమయాన్ని ఈ ప్రాజెక్టు కోసమే కేటాయించారు. ఇందుకు గాను ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

    లాభాల్లో వాటా

    లాభాల్లో వాటా

    ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.... రెండు భాగాల వల్ల వచ్చిన లాభాల్లో రాజమౌళికి మూడో వంతు వాటాగా ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    పర్సనల్ ఖర్చులు

    పర్సనల్ ఖర్చులు

    ఈ ఐదేళ్ల పాటు రాజమౌళికి సంబంధించిన పర్సనల్ ఖర్చులన్నీ నిర్మాతలే భరించినట్లు సమాచారం.

    ఎన్ని కోట్లు

    ఎన్ని కోట్లు

    అయితే ఇప్పటి వరకు లాభాలు ఎంత వచ్చాయి అనేది ఖర్చితమైన సమాచారం లేదు. పార్ట్ 1లో లాభాలు ఎక్కువగా రాలేదు. సినిమా రెండు పార్టులు కలిపి రూ. 450 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఒక్క పార్ట్ 2 ప్రి రిలీజ్ బిజినెస్సే రూ. 438 కోట్ల వరకు జరిగింది. బాక్సాఫీసు బిజినెస్ పూర్తయిన తర్వాత లాభాలు ఎన్ని కోట్లు అనేది తేలనుంది.

    English summary
    As per industry insiders, Rajamouli gets one third share in profits made in both Baahubali films. In addition to that, the producers also have taken care of his personal expenses for all these five years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X