twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క విగ్రహం పెడ్తున్న రాజశేఖర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : అదేంటి హఠాత్తుగా అనుష్కపై అంత ప్రేమ రాజశేఖర్ కు పొంగుకొచ్చి విగ్రహం పెట్టడమేంటి అనుకుంటున్నారా. అయితే విగ్రహం పెట్టించేది నిజమే కానీ అది సినిమాలో సీన్ కోసమే. డా.రాజశేఖర్‌ హీరోగా రూపొందుతున్న సినిమా 'గడ్డం గ్యాంగ్‌' లో అనుష్క కు విగ్రహం కట్టించే సీన్ ఉందని సమాచారం. సూదుకవ్వం రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో ఫ్రెండ్ లలో ఒకరు తన అభిమాన హీరోయిన్ కు విగ్రహం కట్టించి, ఇంట్లో గొడవ అవటంతో పారిపోయి వచ్చేస్తాడు. తమిళంలో ఆ విగ్రహంగా నయనతారది పెట్టారు. తెలుగులో అనుష్క విగ్రహం పెట్టారని, ఆ ఐడియా రాజశేఖర్ ఇచ్చారని తెలుస్తోంది.

    https://www.facebook.com/TeluguFilmibeat

    చిత్రం వివరాల్లోకి వెళితే...

    శివాని శివాత్మిక మూవీస్ పతాకంపై రాజశేఖర్ హీరోగా సంతోష్.పి దర్శకత్వంలో రూపొందుతున్న 'గడ్డం గ్యాంగ్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తై విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంపై రాజశేఖర్ కు మంచి అంచనాలే ఉన్నాయి. తనకు బ్రేక్ ఇచ్చి తిరిగి బిజీ చేస్తుందని నమ్ముతున్నారు.

    ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన 'సూదు కవ్వం' సినిమా రీమేక్. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని నవంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. రాజశేఖర్ తన కెరీర్లో చేస్తున్న ప్రయోగాత్మక సినిమా అని ఆయన సతీమణి మరియు ఈ చిత్ర నిర్మాత జీవిత రాజశేఖర్ అంటోంది.

    Rajasekhar builds statue for Anushka in Geddam Gang

    జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ' తెలుగులో వస్తున్న మొట్ట మొదటి డార్క్ కామెడీ సినిమా 'గడ్డం గ్యాంగ్'. తనకు టచ్ లేని ఇలాంటి సినిమాతో రాజశేఖర్ ప్రయోగం చేస్తున్నాడు. గతంలో రాజశేఖర్ ఎప్పుడూ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చెయ్యలేదు. ఈ మూవీలో తనని చాలా కొత్తగా చూస్తారు. ఓవరాల్ గా గడ్డం గ్యాంగ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే బాగుంటుందని' అన్నారు.

    అలాగే ... తమిళంలో విజయవంతమైన 'సూదుకవ్వం' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నామని, హీరో రాజశేఖర్‌తోపాటుగా మరో నలుగురు అబ్బాయిలు ప్రధానమైన పాత్రలో నటిస్తున్నారని, మొత్తం కలిసి 'గడ్డం గ్యాంగ్'గా సినిమాలో పిలుస్తారని ఆమె తెలిపారు. సంతోష్ 'జర్నీ' చిత్రానికి కో-డైరెక్టర్‌గా వ్యవహరించారని, ఆయన చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని, యూనిట్‌లో అందరూ యువతే ఉన్నారని ఆమె తెలిపారు. 35 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి 30 రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపామని ఆమె తెలిపారు.

    రాజశేఖర్‌కు ఈ చిత్రంలో పాత్ర సరికొత్తగా ఉంటుందని, కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడదగినవిధంగా దర్శకుడు రూపొందిస్తున్నాడని ఆమె అన్నారు. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం ఎన్నో చేతులు మారి తమ వద్దకు వచ్చిందని, తాను ఈ చిత్రంలో నటించాలని కోరిక వున్నా, హక్కులు వేరేవారి దగ్గర ఉండడంతో ఊరుకున్నామని, అయితే ఆ పాత్ర తననే వరించడం ఆనందంగా ఉందని హీరో రాజశేఖర్ తెలిపారు.

    త్వరలో చిత్రాన్ని పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, యూనిట్ అందరి సహకారంతో ఈ చిత్రం శరవేగంగా రూపొందుతోందని దర్శకుడు సంతోష్.పి తెలిపారు.

    నరేష్, గిరిబాబు, సీత, దీపక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మహి ఇలింద్ర, ఎడిటింగ్:రిచర్డ్ కెవిన్, కెమెరా: డిమెల్ జేవియర్ ఎడ్వర్డ్స్, సంగీతం: అచ్చు, నిర్మాత: జీవిత రాజశేఖర్, దర్శకత్వం: పి.సంతోష్.

    English summary
    Hero Rajasekhar is eagerly waiting to strike back with his latest flick ‘Geddam Gang’, which happens to be a remake of Tamil hit ‘Soodhu Kavvum’. Here comes the news about him building a statue for heroine Anushka.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X