twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ని ఉద్దేశించా...రామ్ చరణ్ అలా..??

    By Srikanya
    |

    హైదరాబాద్ :నేనెప్పుడూ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్‌ వెనకాల తిరగలేదు. ‘రచ్చ' నుంచి చూసుకున్నా, నేను కథను నమ్ముకొనే సినిమాలు చేశాను. అఫ్‌కోర్స్‌.. వినాయక్‌ సక్సెస్‌లోనే ఉన్నాడనుకోండి. ఆయన కథ నచ్చే చేశాను. నాకు కథే ముఖ్యం. ఏ డైరెక్టర్‌ కథ నచ్చితే ఆ డైరెక్టర్‌తో చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఈ మాటలు ఎన్టీఆర్ ని ఉద్దేశించా అని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్... హిట్ వచ్చిన దర్శకుడుతో వెంటనే చిత్రం ప్రకటించేస్తూంటారు.

    ఈ విషయమై సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చర్చలు చేస్తున్నారు అభిమానులు. అయితే ఎన్టీఆర్ కీ, రామ్ చరణ్ మధ్య మంచి స్నేహం ఉంది. కాబట్టి అలాంటిదేమీ లేదు ...తను కేవలం తన కెరీర్ గురించి మాత్రమే చెప్పుకున్నాడు. అలా ఒకళ్లుపై కౌంటర్లు వేసే మనస్తత్వం కాదు రామ్ చరణ్ ది. అయినా రామ్ చరణ్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్తున్నారు.

    Ram Charan Counter to NTR?

    రామ్ చరణ్ ఈ చిత్రం గురించి చెప్తూ...కృష్ణవంశీ విషయానికొస్తే, ఆయన చేసిన సినిమాలు ఫెయిలయ్యాయేమో కానీ, డైరెక్టర్‌గా ఆయన ఫెయిలవలేదు. ‘పైసా' కానీ, ‘డేంజర్‌' కానీ.. ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్‌ ఫెయిలయ్యిందంతే. ఓ కథను నమ్ముకున్నప్పుడు రాజీపడకుండా తీసే వంశీ వంటి డైరెక్టరే నాకు కావాలి. నటీనటుల నుంచి నటనను రాబట్టే విషయంలో నెంబర్‌వన్‌ డైరెక్టర్‌ ఆయన. సినిమాలో నాకు బాగా నచ్చింది నా కేరక్టర్‌. దాన్ని తీర్చిదిద్దిన విధానం కానీ, నటునిగా నాలో కొత్త కొత్త కోణాలను కృష్ణవంశీ ఆవిష్కరించిన తీరు కానీ బాగా నచ్చాయి అన్నారు.

    English summary
    Ram Charan said that he is not going behind hit directors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X