twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బ్రూస్ లీ’ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి : ఫిల్మ్ ఛాంబర్ లో సెటిల్ మెంట్

    By Srikanya
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చూసిన సంగతి తెలిసిందే. దాదాపు అరవై కోట్లు దాకా అమ్ముడైన ఈ చిత్రం నలభై కోట్లు షేర్ రావటం కష్టమన్నపరిస్ధితి కనపడుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని పోటీపడి మరీ ఎక్కువ రేట్లకు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ పరిస్ధితి గందరగోళంగా మారింది. వారు తమ లాస్ లను చెల్లించి సెటిల్ చేసుకోమని ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను కలిసి సెటిల్ మెంట్ కు కూర్చున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

    అయితే అందుతున్న సమాచారం ప్రకారం మెగా క్యాంప్ వెంటనే ఎలర్టయ్యి వివాదం పెద్దది కాకుండా వారికి తదుపరి చిత్రం పంపిణీ హక్కులు ఇస్తామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. సురేంద్ర రెడ్డితో ప్లాన్ చేస్తున్న తని ఒరువన్ రీమేక్ చిత్రం ని వారికి ఇస్తామని చెప్పినట్లు వినికిడి.

    Ram Charan's Bruce Lee settlement at Film Chamber

    ఈ సినిమాకు తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ.... శని, ఆది వారాల్లో మాత్రం ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఆదివారం ఇండియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉండటం కూడా కలెక్షన్లపై ఎపెక్టు పడిందని ట్రేడ్ విశ్లేషకులు అన్నారు. అయితే సోమ,మంగళవారాల్లో దసరా శెలవుల ప్రభావం కలిసి వస్తుందని భావించారు. అయితే అనుకున్నంతగా ఆ స్ధాయిలో కలెక్ట్ చేయలేక భారీగా కలెక్షన్స్ పడిపోయాయి.

    కానీ ఇంతకు ముందు మేం చెప్పినట్లుగా..ఓవర్ సీస్ లో ఈ చిత్రం కేవలం $700K మాత్రమే సంపాదించింది. ఒక మిలియన్ మార్క్ కు ఇది చేరేటట్లు కనపడటం లేదు. అయితే ఇప్పటివరకూ యుఎస్ లో రామ్ చరణ్ కు తొలి నుంచీ మార్కెట్ లేదనే వాదనతో దాన్ని సరిపెట్టారు. ఈ సినిమా అయినా ఒక మిలియన్ రీచ్ అవుతుందని అనుకుంటే ...అది కనపడే వాతావరణం భాక్సాఫీస్ వద్ద లేదు.

    English summary
    First time a mega film is undergoing such settlement as there is high pressure from its distributors. Meanwhile, talks are still going on between both parties.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X