twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోగా హిట్ లేదు... ...అతిథి పాత్రలకు కొదవలేదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇప్పటివరకూ హీరోగా టాలీవుడ్, బాలీవుడ్ లలో ట్రై చేసి సక్సెస్ కాలేక మిగిలన రానా ని గెస్ట్ రోల్స్ మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. గతంలో సిద్దార్ద చిత్రం 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌' లో చిన్న పాత్రలో తళుక్కున మెరిసి మాయమయ్యారు రానా. అంతేనా తమిళంలో రాధామోహన్ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. అలాగే...హిందీ బేబి చిత్రంలోనూ గెస్ట్ రోల్స్ చేస్తున్నాడు. ఇలా గెస్ట్ రోల్స్ కు కరెక్టుగా సరిపోతాడనే పేరు తెచ్చుకున్నాడు.

    https://www.facebook.com/TeluguFilmibeat

    అదే కోవలో ఇప్పుడు మరోసారి అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. మంచు లక్ష్మి ప్రసన్న, అడవి శేష్‌ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర ఒకటుంది. చిన్నదే అయినా.. కథ రీత్యా చాలా ప్రాముఖ్యమైన పాత్రట. అందులో రానా కనిపిస్తారని సమాచారం. ఇటీవల రానాపై ఆ సన్నివేశాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. కెరీర్ పరంగా సక్సెస్ లేని రానా ఎప్పుడూ తన చుట్టూ రూమర్స్ మాత్రం ఉండేలా చూసుకుంటున్నాడు. తను ఎప్పుడూ వార్తల్లో ఉండేటట్లు ప్రయత్నిస్తున్నాడు.

    Rana's cameo in Manchu Lakshmi film

    'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాల్లో నటిస్తున్నారు రానా. అవి పూర్తయ్యేలోపు మరికొన్ని సినిమాల్ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్రధారి. నిరువధ్యపురం యువరాజు.. చాళుక్య వీరభధ్రుడుగా రానా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఆయనకు సంభందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు దర్శకుడు. మీరు ఇక్కడ చూస్తున్నది అదే. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి యాక్షన్, ఎమోషన్స్ కి మాత్రమే కాకుండా రొమాన్స్ కు కూడా ప్రాధాన్యత ఉంది.

    దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు. బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎంట్రీ కలవటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

    దర్శుడు మాట్లాడుతూ... ''కాకతీయుల కాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా ఈ సెట్‌లు ఉండబోతున్నాయి. వీటి కోసం తోట తరణి 400 స్కెచ్‌లు వేశారు. నాటి సంప్రదాయలు, జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చిత్రబృందం ఎంతో శ్రమించి వీటికి రూపు తీసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని సెట్‌లలో షూటింగ్‌ చేశాం. మిగిలిన వాటిలో త్వరలోనే చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.

    రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది . రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.

    అమ్మాయిలంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే. రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్‌.

    భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

    ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

    ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    Rana Daggubati will be making special appearance in Manchu Lakshmi's next titled 'Pilavani Perantam.' This project had a formal launch a while back and the shooting is also progressing at good pace. The latest update from the production team is, Rana has been roped to play a guest role in the film. It is heard, Rana completed his part.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X