» 

దాచిపెట్టి రవిబాబుకి ట్విస్ట్ ఇచ్చిన భూమిక

Posted by:

హైదరాబాద్ : రవిబాబు,భూమిక కాంబినేషన్ లో గతంలో అనసూయ చిత్రం వచ్చి హిట్టైంది. ఆ సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకునే ఏమోగానీ రవిబాబు తన తాజా చిత్రం లడ్డుబాబు లో ఆమెకు మరో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తన భర్త చనిపోయాక ఒంటిరితనంతో బాధపడే యువతిగా ఆమెకు పాత్ర ఇచ్చారు. అయితే ఈ షూటింగ్ సమయంలో ఆమె ప్రెగ్నింట్ . ఈ విషయాన్ని ఆమె షూటింగ్ చివరి రోజు దాకా రవిబాబుకి గానీ, ఆ యూనిట్ కి కానీ తెలియకుండా జాగ్రత్తగా మ్యానేజ్ చేసి, చివరి రోజున రవిబాబుకి చెప్పి ట్విస్ట్ ఇచ్చిందిట. ఇక రెండు నెలల క్రితమే ఆమె ఓ మగబిడ్డకు తల్లి అయ్యింది.

ఇక లడ్డుబాబు చిత్రం డిజాస్టర్ గా నమోదైంది. అల్లరి నరేష్ చిత్రాల్లో ఇంత పూర్ ఓపినింగ్స్ వచ్చిన చిత్రం ఇదే అంటున్నారు. ఈ విషయమై రవిబాబు మాత్రం చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. 'లడ్డుబాబు' కథను నరేష్‌ కోసం రాసుకోలేదు. 'లావు మనిషి' అంటూ చాలా కాలం క్రితమే రాసుకున్నాను. దీనికి నరేష్‌ అయితే బాగుంటాడు అని ఆయన్ని పెట్టుకున్నాం అన్నారు.

'అల్లరి'తో ప్రేక్షకులకు పరిచయమైన నరేష్‌ని 'లడ్డుబాబు'గా మార్చాను. ప్రచార చిత్రాలు చూసి కొందరు నరేష్‌ ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నారు. ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేశామో అర్థం చేసుకుంటున్నారు. ఇది ఓ బరువైన కథ. తండ్రీ- కొడుకు, తల్లి-బిడ్డ, స్నేహబంధం... ఇలా అనేక అంశాల్ని సినిమాలో చూపించాం. దానికి వినోదం కూడా జోడించాం. దీన్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

అలాగే రవిబాబు తను ఎందుకు కామెడీ సినిమాగా దీన్ని తీయలేదో చెప్తూ... హీరోని భారీకాయుడిగా చూపించి వినోదాత్మకమైన చిత్రం తీస్తారనుకున్నాం.. కానీ ఇలా భావోద్వేగభరిత సినిమా ఎందుకు తీశారు అని కొందరు అడుగుతున్నారు. నేను నరేష్‌తో సినిమా చేయాలి అనుకోగానే నాకు రెండు ఆలోచనలు వచ్చాయి. ఒకటి నరేష్‌తో సాధారణమైన వినోదాత్మకమైన సినిమా చేయకూడదని. రెండు ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులు, పిల్లలకు చేరాలని. అందుకే ఇలాంటి సినిమా చేశా అన్నారు. నా గత సినిమాలు చూసి ఈ సినిమాని అంచనా వెయ్యొద్దు. తాజా ఆలోచనలతో రండి.. సినిమా చూసి ఆనందించండి అని చెప్పారు


ప్రతి సినిమా అన్ని వర్గాలకు నచ్చాలనే ఆలోచనలో ప్రస్తుతం సినీ జనాలున్నారు. అందరికీ నచ్చే సినిమా చేయాలంటే గతంలో వచ్చిన వాటినే మార్పులు చేసి తీయాలి. అప్పుడు అది కాపీ అవుతుంది. అలా కాకుండా వైవిధ్యంగా ఆలోచిస్తేనే కొత్తదనం కనిపిస్తుంది. నేను అలాగే ఆలోచించి ఈ 'లడ్డుబాబు' సినిమా చేశాను అన్నారు రవిబాబు.

Read more about: allari naresh, ravi babu, bhoomika, laddu babu, అల్లరి నరేష్, రవి బాబు, భూమిక, లడ్డుబాబు
English summary
Bhumika Chawla recently became a mother having delivered a baby boy recently in Mumbai. Apparently the actress was pregnant when she was shooting for Laddu Babu. However, the cast and crew of the film were unaware of this fact. Apparently the actress revealed it to the filmmaker Ravi Babu only after completing the shooting much to his shock.
Please Wait while comments are loading...