» 

బండ్ల గణేష్, రవితేజ కాంబినేషన్ ....డిటేల్స్

Posted by:

హైదరాబాద్: హిట్ ఎక్కడుంటే అక్కడ నిర్మాత బండ్ల గణేష్ వాలిపోతారు. తాజాగా ఆయన మరో ప్రాజెక్టు ఖరారు చేసినట్లు సమాచారం. వరస ప్లాపుల్లో ఉన్న రవితేజ 'బలుపు'తో బాక్సాఫీస్ చెడుగుడు ఆడేసాడు. దాంతో ఆయన తదుపరి చిత్రాలను జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకుంటున్నాడు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా రవితేజ పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి అహ నా పెళ్లంట, పూలరంగడు చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తారని తెలిసింది. బండ్ల గణేష్ ఈ చిత్రం నిర్మించనున్నారని చెప్తున్నారు. గతంలో బండ్ల గణేష్, రవితేజ కాంబినేషన్ లో ఆంజనేయులు చిత్రం వచ్చింది. ఆల్రెడీ బండ్ల గణేష్...

ప్రస్తుతం నాగార్జున 'భాయ్' చిత్రం పనుల్లో బిజీగా ఉన్న వీరభద్రం... మరో వైపు రవితేజ కోసం పూర్తి ఎంటర్టైన్మెంట్ కథను సిద్ధం చేసుకుంటున్నట్లు వినికిడి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 'భాయ్' చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని టాక్ ఉంది. దాంతో వీరభధ్రం దర్శకత్వంలో చేయాలని హీరోలంతా ఉవ్విళ్ళూరుతున్నారు.

మకరో ప్రక్క రవితేజ ... 'బలుపు' చిత్ర కథా రచయిత బాబీని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. వైవియస్ చౌదరి ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ మేరకు పూజా కార్యక్రమాలు వైవియస్ చౌదరి ఆఫీసులో మొన్నా మధ్య జరిగాయి. పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ ఫిల్మ్ గా చిత్రం రూపొందనుందని సమాచారకం. ఈ నెలాఖరనుంచి చిత్రం షూటింగ్ మొదలు కానుంది. బాబి గతంలో ... డాన్ శ్రీను, బాడీ గార్డ్, మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలకు రచనా సహకారం అందించారు.

వరుస ప్లాపులతో సతమతం అయిన రవితేజకు 'బలుపు' చిత్రం హిట్‌తో కాస్త ఊరట లభించింది. ఇంత కాలం స్క్రిప్టుపై పెద్దగా దృష్టి పెట్టని రవితేజ... బలుపు చిత్రం దగ్గర నుంచి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. గుడ్డిగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటే పోతే తన కెరీర్‌కు ఆపద తప్పదని గ్రహించాడు. అందుకే కథ, స్క్రిప్టు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ చిత్రం తో పాటు రవితేజ తర్వాతి సినిమా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కథ, స్క్రిప్టు విషయంలో ఓ అవగాహన కుదిరిందని తెలుస్తోంది.

Read more about: raviteja, veerabadram, bhai, రవితేజ, వీరభద్రం, భాయ్
English summary
Buzz is that director Veerabhadram, producer Bandla Ganesh and hero raviteja will team up soon. reports say that bandla ganesh already gave some advance to veerabhadram and tries to rope raviteja into new project. earlier the film anjaneyulu came with raviteja and bandla ganesh combination.
Please Wait while comments are loading...