» 

రవితేజ ఇన్ సెక్యూరిటీ తో చేస్తున్నాడా?

Posted by:

హైదరాబాద్ : హీరోలు అయినా దర్శకులు అయినా సేఫ్ గేమ్ ఆడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూంటారు. గతంలో హిట్ అయిన కారణాలు వెతికి వాటిని తమ తాజా చిత్రాల్లో కలపటానికి ప్రయత్నిస్తూంటారు. అటువంటి సేఫ్ గేమ్ ఆడటానికే రవితేజ ప్రయత్నిస్తున్నాడంటున్నారు. ఆ మధ్య వరసగా వచ్చిన ఫ్లాపుల నుంచి బలుపుతో కోలుకోవటంతో తన తాజా చిత్రం 'వపర్‌' లో జాగ్రత్తలు కాస్త ఎక్కువ తీసుకుంటూ బలుపుని అనుకరిస్తున్నాడు. అయితే ఇది ఇన్ సెక్యూరిటీ చేసే పనులు అని పరిశ్రమలో గుసగుస లు వినిపిస్తున్నాయి.

గతంలో 'బలుపు'కోసం రవితేజ 'కాజల్‌ చెల్లివా..' పాటను పాడిన విషయం తెలిసిందే. తన తాజా చిత్రం 'వపర్‌'కోసం రవితేజతో ఓ పాట పాడించారు. తమన్‌ స్వరాలందిస్తున్న 'నోతంకీ.. నోతంకీ..' అంటూ సాగే పాటను రవితేజ పాడారు. భాస్కరభట్ల ఈ పాటను రచించారు. రీసెంట్ గా చెన్నై లో రికార్డు చేసారీ పాటని.

'మాస్‌ అంటే బస్‌ పాస్‌ కాదు..' అంటూ 'పవర్‌' ప్రచార చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించారు రవితేజ. దీన్ని చూసినవారందరితో 'రవితేజ మరోసారి అదరగొడతాడు' అనిపించారు. ఈ అంచనాలను అందుకోవడానికి దర్శకుడు కె.రవీంద్రనాథ్‌ (బాబి) మరిన్ని ఆలోచనలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ జాగ్రత్తలు అని చెప్తున్నారు.

సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ...'ఇంతకు ముందు బలుపు చిత్రానికి రైటర్‌గా పని చేసాను. ఇపుడు డైరెక్టర్‌గా కూడా అవకాశం ఇచ్చారు రవితేజ. టాలెంటు, కసి ఉన్న వారిని ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. ఈ సినిమాతో నన్నునేను నిరూపించుకుంటాను. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తారు' అని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ...'తెలుగులో నాకు ఇదే తొలి సినిమా. రవితేజ నుంచి నాలుగేళ్ల నుంచి సినిమా చేయాలనుకుంటున్నాను. బాబీ మంచికథ చెప్పారు. కన్నడలో 33 సినిమాలు, తమిళంలో 2 సినిమాలు చేసాను. ఈ సినిమాతో తెలుగులోనూ సక్సెస్ అవుతాననే నమ్మకం ఉంది' అన్నారు.

ఈ సినిమాలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రుషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : థమన్, సినిమాటోగ్రఫీ: ఆర్దర్.ఎ.విల్సన్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, మాటలు: కోన వెంకట్, స్క్రీన్ ప్లే: కె.చక్రవర్తి, మోహన్ కృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పి.ఎ.కుమార్ వర్మ, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి)

Read more about: ravi teja, balupu, bobby, kona venkat, రవితేజ, బలుపు, బాబి, కోన వెంకట్
English summary
Raviteja sang a song with lyrics of Notanki Notanki penned by Bhaskar Bhatla. The song's recording has been done in Chennai recently. Thaman is the music director for the film. Raviteja, Hansika, Regina starrer ‘Power’ is progressing at brisk pace under the direction of KS.Ravindranath (Bobby).
Please Wait while comments are loading...