twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమ్మలేని నిజాలా..? మెగాస్టార్ పై దుష్ప్రచారమా..? మరీ ఇలా చేస్తున్నారా..?

    |

    ఒక మోస్తరు అంచనాలున్న మామూలు సినిమా వస్తూందంతేనే బయ్యర్లలో ఒక విస్ధమైన పోటీ నెలకొంటుంది. అలాంటిది మెగాస్టార్ సినిమా అంటే? అదీ దాదాపు గా ఒక దశాబ్దం దగ్గర లో గ్యాప్ తీసుకుని వస్తున్న సినిమా అంటే ఇక చెప్పేదేముంది. రకరకాల వారతలు వస్తూనే ఉంటాయి. ఈ సినిమా తో పాటే వరుసగా అగ్రహీరోలందరి సినిమాలూ అదే సమయం లో రాబోతున్నప్పుడు. ఇక ఆ హడావుడి మామూలుగా ఉందదు. ఎవేవో రూమర్లు వస్తూనే ఉంటాయి. నిజానికి కొన్ని వింతప్రయత్నాలు జరగటం మామూలే అయినా ఒక స్థాయిని మించి వాటికి మరికొన్ని వార్థలు తోడవుతూంటాయి.

    ఇప్పుడు మేగామూవీ ఖైదీనెంబర్ 150 సినిమా విషయం లో కూడా సరిగ్గా అదే జరుగుతున్నట్టు ఉంది. చాలా రోజుల నుండి ఇదిగో కమ్ బ్యాక్ అదిగో కమ్ బ్యాక్ అంటూ నాన్చుతూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మొత్తానికి 2016లో 'కత్తి' సినిమా రీమేక్ ''ఖైదీ నెం 150''తో ఇక తన మెగా రీ-ఎంట్రీకి నాంది పలికారు. అయితే 9 ఏళ్ళ గ్యాప్ తరువాత మెగాస్టార్ ఒక ఫుల్ ప్లెడ్జడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు కాబట్టి సాధారణంగా హైప్ బాగానే ఉంటుంది. ఇదే సమయం లో వస్తూన్న వార్తలు కూడా అల్గే ఉనాయి కాస్త షాకింగ్ గా అనిపించే ఆ వార్తలవైపు ఒక లుక్ వేస్తే....

    బాగానే వెనకేసుకున్నాడు:

    బాగానే వెనకేసుకున్నాడు:

    పదేళ్ల తర్వాత వెండితెరపై తిరిగి కనిపించబోతున్న చిరంజీవి పునరాగమన చిత్రానికి ఫుల్‌ హైప్‌ తేవడానికి రామ్‌ చరణ్‌ బాగా కృషి చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఫామ్‌లో వున్న హీరోల చిత్రాల రేంజ్‌లో అమ్మి బాగానే వెనకేసుకున్నాడు. ఆ స్థాయిలో డబ్బులు ఇవ్వడానికి ముందుకొచ్చిన బయ్యర్లకే ఈ చిత్రం రైట్స్‌ అమ్మారు.

     థియేటర్లనీ బ్లాక్‌ చేసేయమని:

    థియేటర్లనీ బ్లాక్‌ చేసేయమని:

    ఇదిలావుంటే ఖైదీ నంబర్‌ 150కి ఎలాగైనా రికార్డులు వచ్చేలా చూడాలని బయ్యర్లందరికీ ఆదేశాలు వెళ్లాయనే వార్త ఇప్పుడు వినిపిస్తోంది. మొన్నటికి మొన్న వచ్చిన కబాలి సినిమాకి ఎంతటి హైప్ వచ్చిందో దానికి సమానం గా రెండు రాష్ట్రాలలోనూ చిరు సినిమా అలజడి సృష్టించాలని భావిస్తున్నారట. అందుకే ఆరు నూరైనా ఈ చిత్రం జనవరి 11న విడుదల అవుతుందని, అంచేత అన్ని థియేటర్లనీ బ్లాక్‌ చేసేయమని చెప్పారట. సంక్రాంతికి వచ్చే మిగతా సినిమాలతో పని లేకుండా దీనికి ఓపెనింగ్‌ అదిరిపోయేలా చూడమని ఆదేశించారట.

    అంతగా జనాకర్షణ వుండదనే:

    అంతగా జనాకర్షణ వుండదనే:

    అయితే ఓపెనింగ్‌ రికార్డులెప్పుడూ ఫలానా సినిమా చూడాలనే కోరిక జనాల్లో బాగా ఉంటేనే కదా వచ్చేది? ఇలా ఫాల్స్‌ హైప్‌ సృష్టించడం వలన రికార్డులు వస్తాయా? చిరంజీవి రాజకీయ రంగంలో పోగొట్టుకున్న ఇమేజ్‌ వల్ల ఈ చిత్రానికి అంతగా జనాకర్షణ వుండదనే టాక్‌ వుంది. బహుశా దానికి కానీ ఈ చిత్ర బృందం వర్రీ అవుతున్నారో ఏమిటో తెలీడం లేదు.

     రికార్డులు అవసరమా :

    రికార్డులు అవసరమా :

    ఈ సినిమా చూడాలనే ఆసక్తిని పుట్టించినట్టయితే ఇప్పుడు ఓపెనింగ్ కలక్షన్లు వాటంతట అవే వచ్చి పడిపోతున్నాయి. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమాకి రికార్డులు అవసరమా లేక మళ్లీ ఆయనని అక్కడ నిలబెట్టే ఒక మంచి సినిమా అవసరమా? అన్నదే పాయింటు కేవలం డబ్బులకోసమే సినిమా తీసే అవసరం చిరు కి లేదనే అనుకోవాలి. ఓపెనింగ్‌ రికార్డులు మాత్రం వచ్చి ఆ తర్వాత పడిపోయే సినిమా వల్ల చిరంజీవికి ఇప్పుడు ఒరిగేదేమీ ఉండదు కదా?

    కేవలం ఓపెనింగ్ కలెక్షన్లు:

    కేవలం ఓపెనింగ్ కలెక్షన్లు:

    అంతే కాదు ఈ సినిమా తో వచ్చే క్రేజ్ ని మళ్ళీ తన రాజకీయ కెరీర్ కి ప్లస్ గా మార్చుకోవాలనుకుంటున్నారనీ కాబట్టే ఈ సినిమాని ప్రిస్టేజియస్ గా తీసుకున్నారనీ వచ్చిన మరికొన్ని వార్తలని బట్టి కూడా చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలి తప్ప కేవలం ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టుకునే సినిమా గా మిగిలిపోవటం సరైంది కాదు.

    అభిమానులదే కీలక పాత్ర:

    అభిమానులదే కీలక పాత్ర:

    ఈ సినిమా అయిపోవటం తోనే వరుసగా మరో రెండు సినిమాలు చేసేయాలనుకుంటున్నారట చిరంజీవి అంటే ఈ 2019 ఎన్నికలలోపు చిరు 151 వ సినిమాకూడా రిలీజ్ అయిపోవాలి. మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక చరిత్ర. ఎన్నో సక్సెస్ చిత్రాల వెనుక తను పడ్డ కష్టం చెప్పలేనిది. తన సక్సెస్ వెంటే అభిమానులు కూడ నడిచారు. ఆ తరువాత చిరంజీవి ని ఓ కీలక రాజకీయనాయకుడిగా మార్చిన దాంట్లోనే అభిమానులదే కీలక పాత్ర. చిరంజీవి సినీరాజకీయ ప్రస్థానంలో అభిమానుల ప్రస్థానం లేకుండా ముందుగా సాగలేం.

     వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ :

    వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ :

    దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే మెగా అభిమాన సంఘాలకు చేరాయని అంటున్నారు. ఇందుకు అభిమాన సంఘాలు నుండి సైతం మద్ధతు లభించింది. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకి అంటీఅంటనట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారంట. అందులో భాగంగానే వరుస చిత్రాలను ఒప్పుకుంటున్నారు. 150వ చిత్రంతో తన కోరికను తీర్చుకోవాలనుకున్న చిరంజీవి, ఆ తరువాత కూడ వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వస్తున్నారు.

     : అది అమాయకత్వమే:

    : అది అమాయకత్వమే:

    ఇప్పటకే 151, 152 చిత్రాలకి సంబంధించిన వాటిపై చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. చిరంజీవి ఇక రాజకీయాలకు దూరంగా ఉండటం అనేది ఎటూ కుదరదు. అయితే కేవలం ఈ ఒక్క సినిమాతోనే ఆ హైప్ మొత్తం తిరిగి తెచ్చేసుకోవాలనుకోవటమూ, దానికోసం థియేటర్లను బ్లాక్ చేయాలనుకోవటమూ లాంతివి చేయాలని మెగా కాంపౌండ్ గనక ఆలోచిస్తే అది అమాయకత్వమే అవుతుంది అంతే కాదు ఇది సినిమా ఫలితాలమీద కూడా ప్రభావం చూపిస్తుంది.

     జనసేన పార్టీలో:

    జనసేన పార్టీలో:

    దాదాపు 9 సంవత్సరాల తరువాత వస్తున్న చిరంజీవి సినిమా బాక్సాఫీస్ ని ఏ విధంగా షేక్ చేయనుందనేది ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి కాంగ్రేస్ పార్టీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో ముఖ్యంత్రి అభ్యర్ధిగా నిలబడనున్నారనేది మరో వార్త.. ఇలా ఒకదాని వెనుకగా మరొకటి గా ఈ సినిమా మొదలైన దగ్గరినుంచీ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది అయితే వీటిలో నిజమెంతా అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరుఇకీ తెలియదు.

    English summary
    the Latest buzz is that Records the only Aim for Megastar new Novie Khaidi no. 150 the remake of tamil cinima Katti...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X