twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పటం లేదు: పవన్ కోసం నిబంధనలు...జాగ్రత్తలు

    By Srikanya
    |

    హైదరాబాద్: పరిస్దితులు గతంలో లాగ లేవు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ సెల్ ఫోన్ తోనో లేక ట్యాబ్ కెమెరాతోనో...హీరో గెటప్ లు తీసి ఇంటర్నెట్ లో వదలటం కామన్ అయిపోయింది. చాలా పెద్ద సినిమాలు ఈ పరిస్ధితి ని ఎదుర్కొన్నాయి. దాంతో ఎక్సక్లూజివ్ అనుకున్న గెటప్ ల విషయంలో దర్శక,నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్...'గోపాల గోపాల' చిత్రం షూటింగ్ లో ప్రత్యేకమైన నిబంధనలు అమలు పరుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అత్తారింటికి దారేది చిత్రం సమయంలో జరిగిన పైరసీని కూడా దృష్టిలో పెట్టుని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. బయిటవారిని ఎవరినీ సరైన అనుమతి లేనిదే సెట్ లోకి ప్రవేశించ నివ్వటం లేదు. అలాగే..షూటింగ్ సమయంలో సెల్ లు వాడనివ్వటం లేదు.

    పవన్‌కల్యాణ్‌ 'గోపాల గోపాల'లో అరగంటకి మించి కనిపించరు... ఆయన పాత్ర పావుగంటే అని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిత్రవర్గాలు మాత్రం ఆయన ద్వితీయార్థం అంతా కనిపిస్తారని చెబుతున్నాయి. మోడ్రన్‌ శ్రీకృష్ణుడి పాత్రని పోషిస్తున్నారు. ఆ పాత్రలో పవన్‌ పలికే సంభాషణలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. పవన్‌ అభిమానుల్ని మరింతగా సంతోషపెట్టాలన్న ప్రయత్నంలో భాగంగా పాత్రని మరికొంచెం పెంచాలని చిత్రబృందం భావించిందట.

    Restrictions on Pawan's Gopala Gopala sets

    అయితే పవన్‌ ఆ ప్రయత్నాన్ని తిరస్కరించినట్టు సమాచారం. కథని ఉన్నదున్నట్టు తీస్తేనే మేలని... పాత్రని ఏమాత్రం కదపనీయలేదట. వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ జోడీ చాలా బాగుందనీ... వారిద్దరూ ప్రేక్షకులకు సరికొత్త వినోదాలు పంచబోతున్నారని చిత్రబృందం చెబుతోంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

    పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమాకి కొబ్బరికాయ కొడుతున్నారని తెలిస్తే చాలు... పరిశ్రమలో సందడి మొదలైపోతుంటుంది. ఇక ఆయన సెట్‌లోకి కూడా అడుగు పెట్టాడంటే ఆ హడావుడి మరింత పెరిగిపోతుంటుంది. ఫిల్మ్‌నగర్‌ నుంచి పవన్‌కి సంబంధించి రోజుకొక కొత్త విషయం బయటికొస్తుంటుంది. అభిమానులు, వ్యాపారవర్గాలు ఆయన సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొంటుంటారు.

    సుదీర్ఘకాలం తర్వాత పవన్‌ ఇటీవలే కెమెరా ముందుకొచ్చారు. నడుమునొప్పి వేధిస్తున్నా 'గోపాల గోపాల' కోసం రంగంలోకి దిగారు. వెంకటేష్‌తో కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. ముందుగానే స్క్రిప్ట్‌పై అవగాహన పెంచుకొన్న పవన్‌ ఉత్సాహంగా చిత్రీకరణలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఏడాదికి వంద రోజులు సినిమా కోసం కేటాయిస్తానని ఇదివరకే చెప్పారు పవన్‌కల్యాణ్‌. ఆ మేరకు ఇప్పుడు 'గోపాల గోపాల' కోసం కాల్షీట్లు ఇచ్చేశారు.

    పవన్‌కల్యాణ్‌ కేటాయించిన కాల్షీట్లు 30రోజుల్లోపే అని మెగా కాంపౌండ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి ఆయన ఈయేడాది మరో సినిమా కూడా చేస్తారని అర్థమవుతోంది. 'గోపాల గోపాల' తర్వాత చేయబోయే సినిమాల గురించి కూడా పవన్‌ ఇప్పుడు కసరత్తులు మొదలుపెట్టారని తెలుస్తోంది. కొత్త కథలు వింటున్నట్టు సమాచారం.

    English summary
    Since Pawan Kalyan is playing a different role Lord Krishna in Gopala Gopala, remake of Hindi hit Oh My God, he is taking all precautions. He is not allowing outsiders in the sets and also banned use of cell phones in the sets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X