Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
షాకింగ్: రామ్ గోపాల్ 'వర్మతో సరళా ఆంటీ'?
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ....తెలుగు ప్రేక్షకుల మీదకు సినిమాల మీద సినిమాలు వదులుతున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఆయన దర్శకత్వంలో ఇప్పటికే రౌడీ, ఐస్ క్రీం, అనుక్షణం లాంటి సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో మరో రెండు సినిమాలు ‘పట్ట పగలు', ‘ఐస్ క్రీం-2' చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో పాటు మోహన్ బాబు ఫ్యామిలీకి చెందిన బేనర్లో మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు.
కాగా...త్వరలో రామ్ గోపాల్ వర్మ సరికొత్త కాన్పెప్టుతో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌లో తన పేరు కూడా వచ్చేలా టైటిల్ డిజైన్ చేస్తున్నారట. ‘వర్మతో సరళా ఆంటీ' అనే టైటిల్‌లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. సరళ ఆంటీ పాత్రలో ఓ ప్రముఖ తార నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ‘ఐస్ క్రీం 2' సినిమా వివరాల్లోకి వెళితే...ఐస్ క్రీమ్' చిత్రాన్ని రెండే రెండు మెయిన్ క్యారెక్టర్స్‌తో ఒకే ఒక ఇంటిలో షూట్ చేసారు. కానీ ‘ఐస్ క్రీమ్-2'ను మొత్తం ఔట్ డోర్ లో పదహారు ప్రధాన పాత్రలతో తీసారు. కథాపరంగా రెంటికీ సంబంధం ఉండదు.
జె.డి.చక్రవర్తి, నవీన, జీవా, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్, శాలిని, గాయత్రి, రామ్ గుప్తా, ప్రభాకర్, బినోజి ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ చిత్రానికి పోస్టర్స్ డిజైన్: నవీన్ కళ్యాణ్-కాశి, ప్రెస్ రిలేషన్స్: ధీరజ అప్పాజీ, సౌండ్ డిజైన్: హరి, మ్యూజిక్: శ్రీరామ్, లిరిక్: సిరాశ్రీ, నిర్మాణ: తుమ్మలపల్లి రామ సత్య నారాయణ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.