» 

అవుట్ ఫుట్ సరిగ్గా రాలేదని రీషూట్?

Posted by:

హైదరాబాద్ : ఓ సినిమా రిలీజ్ డేట్ అనుకున్న తేది కాకపోతే ....ఫైనాన్స్ ప్లాబ్లలు అయినా ఉంటాయి లేదా...రీషూట్ సమస్యలైనా ఉంటాయి. సాధారణంగా సినిమా ప్రి ప్రొడక్షన్ సమయంలో మొత్తం అవుట్ పుట్ చూసుకుని, ఏమన్నా ఇబ్బందులు ఉంటే రీషూట్ లు పెట్టుకుంటూరు. అయితే సినిమా సరిగ్గా రానప్పుడు కూడా రీ షూట్ పెడుతూంటారు. తాజాగా అలాంటి సమస్యే 'రన్ రాజా రన్' చిత్రానికి వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే అది ఎంత వరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

శర్వానంద్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రన్ రాజా రన్'. జూలై 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల వాయిదా పడిందనే విషయం తెలిసిందే. కానుంది. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. సీరత్ కపూర్ నాయిక. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. సుజిత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అవుట్ ఫుట్ సరిగ్గా రాలేదని రీషూట్?

నిర్మాతలు మాట్లాడుతూ "మా సంస్థలో రూపొందుతున్న తొలి చిత్రం 'మిర్చి' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 'రన్ రాజా రన్' రెండో సినిమా ఇది. దర్శకుడు చెప్పిన కథ, కథనం నచ్చింది. ప్రతి ఒక్కరూ థ్రిల్ ఫీలయ్యేలా ఉంది. వినూత్నమైన లవ్ ఎంటర్‌టైనర్. సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకు మది కెమెరా హైలైట్ అవుతుంది. గిబ్రాన్ మంచి సంగీతాన్నిచ్చారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఆడియో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మా సంస్థలో మంచి సినిమాలు వస్తాయని నమ్ముతున్న ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను రూపొందించాం'' అని చెప్పారు.

అడవి శేషు, సంపత్, జయప్రకాష్‌రెడ్డి, అలీ, వెన్నెల కిషోర్, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: మది, సంగీతం: గిబ్రాన్.యం., ఎడిటర్: మధు, ఆర్ట్: ఎ.యస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.

Read more about: sarwanand, mirchi, prabhas, run raja run, శర్వానంద్, మిర్చి, ప్రభాస్, గోపీచంద్, రన్ రాజా రన్
English summary
'Run Raja Run' was expected to hit screens on July 11th initially and then the date got shifted to July 18th.

Telugu Photos

Go to : More Photos