Don't Miss!
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- News మేషరాశిలో సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధననష్టం
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సల్మాన్ ఖాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్, అర్పితా పెళ్లిలో?
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై మీడియా ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతోంది. ఆయన వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఆయన గర్ల్ ఫ్రెండ్స్ గురించి మీడియా కొత్త విషయాలు బయటపెడుతూనే ఉంటోంది. ఆయన గర్ల్ ఫ్రెండ్స్ జాబితా నిజానికి చాలా పెద్దదే.
తన తాజా గర్ల్ ఫ్రెండ్ యూలియా వంటూర్‌ను సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ పెళ్లిలో అందరికీ పరిచయం చేశాడట. తన సన్నిహిత మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఆమెను పరిచయం చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముంబై మిర్రర్‌లో ఈ మేరకు ఓ వార్తాకథనం వచ్చింది.
ఆ అందాల నటి అతుల్ అగ్నిహోత్రి సినిమా ఓ తేరీలో దర్శనమిచ్చింది. సల్మాన్ కాన్, యూలియా కలిసి తిరుగుతున్నారని, అయితే జాక్విలిన్ ఫెర్నాండెజ్, డైసీ షాలతో జోడించి సల్మాన్ ఖాన్‌పై పుకార్లు చేస్తున్నాయని, వాస్తవానికి యూలియాతో సల్మాన్ ప్రేమలో పడ్డాడని, యులియా సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో పూర్తిగా కలిసిపోయిందని అంటున్నారు.
సల్మాన్ ఖాన్ రొమీనియన్ బ్యూటీ యులియాను కబీర్ ఖాన్ ఏక్ థా టైగర్ సినిమా షూటింగ్ సమయంలో డుబ్లిన్‌లో కలిశాడట. బాడీగార్డ్‌లో పెట్టుకోవడానికి ఓ రొమినీయన్ సాంగ్ హక్కుల పొందడానికి సల్మాన్ ఖాన్‌కు అప్పటి యూలియా బాయ్ ఫ్రెండ్ మారియూస్ మోగా సహాయం చేశాడట. యూలియా, మారియూస్ ఏడాది క్రితం విడిపోయారు.