twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్దార్ గబ్బర్ సింగ్ :పవన్ పులి స్వారీ?ఎంతవరకూ నిజం?

    By Srikanya
    |

    హైదరాబాద్ :పవన్ హీరోగా నటింస్తున్న తాజా సినిమా సర్థార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా కోసం రాత్రింబవల్లూ కష్టపడింది ఆ టీం. ఏప్రియల్ 8 న ఈ టీమ్ కు రిజల్ట్ రాబోతోంది. ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. అయితే ఇది పవన్ పులి స్వారీ అంటున్నారు ట్రేడ్ పండితులు.

    అసలు పవన్ సినిమా అంటేనే ఫ్యాన్స్ లో , ట్రేడ్ లో, సినీ లవర్స్ లో క్రేజ్ విపరీతంగా ఉంటుంది. దానికి తోడు ఈ సినిమా పోస్టర్స్, ప్రోమోల్లో..పవన్ గుర్రం మీద కనపడుతూ కనపడగానే, ఆ స్టైల్ కు ముగ్దులైపోయి ఆ ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి.

    ట్రైలర్ కు మిక్సెడ్ టాక్ : అందుకే పవన్ ఏటిట్యూడ్ చూపెట్టి కుమ్మేసాడుట్రైలర్ కు మిక్సెడ్ టాక్ : అందుకే పవన్ ఏటిట్యూడ్ చూపెట్టి కుమ్మేసాడు

    దానికి తోడు పవన్ సూపర్ హిట్ గబ్బర్ సింగ్ కు ప్రాఛైజీ చిత్రం కూడా సినిమా ప్రారంభం నుంచి అందరి దృష్టీ పడేలా చేసింది. అదే ఇప్పుడు సమస్య అంటున్నారు. ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ 85-90 కోట్లు వరకూ జరిగిందని సమాచారం. ఇంకే హ్యాపీ అంటారా..అక్కడే ఉంది లాజిక్.

    స్లైడ్ షోలో పవన్ పులి స్వారీ అనటానికి రీజన్స్..

    మైల్డ్ రెస్పాన్స్

    మైల్డ్ రెస్పాన్స్

    కావాలని రిలజ్ చేసారో మరేమో కానీ సర్దార్ ట్రైలర్ కు ఊహించిన రీతిలో రెస్పాన్స్ రాలేదు. మైల్డ్ గా ట్రైలర్ ఉందని అంతటా వినిపించింది. మీడియాలోనూ అదే మాట రిపీట్ అయ్యింది. కానీ ఇన్ సైడ్ టాక్ ఏంటంటే... సినిమాపై అంచనాలు తగ్గించటానికే పవన్ అలా చేసారని.

    జానీ తర్వాత

    జానీ తర్వాత

    జానీ తర్వాత 12 సంవత్సరాలు పవన్ కష్టపడి రాసిన కథ అనటమే తప్పు అన్నట్లుగా మీడియా చిత్రీకరిస్తోంది. వ్యంగ్య బాణాలు విసురుతోంది ఓ వర్గం . అయితే ఇన్ సైడ్ టాక్..కథ ఊహించని రీతిలో ఉంటుందని, సెకండాఫ్ లో వచ్చే ఫన్ ఎపిసోడ్ హైలెట్ అనీను.

    ఎంత నష్టం

    ఎంత నష్టం

    సినిమా ఫెయిలైతే 25 నుంచి 30 కోట్లు వరకూ నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే సినిమా ఫెయిల్ అయ్యి ఛాన్సే లేదని ఇన్నర్ టాక్. అన్ని జాగ్రత్తలూ తీసుకునే పవన్ మన ముందుకు వస్తున్నాడు అనీను.

    కాస్త రిస్క్

    కాస్త రిస్క్

    ఈ సారి భారీ మొత్తాలతో ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ బిజినెస్ జరిగింది. అక్కడే కాస్త రిస్క్ ఫాక్టర్ ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్ ని వదిలేస్తే.. టాక్,రివ్యూల ని బట్టి అక్కడ రెండో రోజు జనం సినిమాకు వెళ్తున్నారు.

    ఎంతొస్తే సేఫ్

    ఎంతొస్తే సేఫ్

    ఈ సినిమా 85 కోట్లు వెనక్కి వస్తే సేఫ్. యావరేజ్ టాక్ వస్తే మాత్రం రికవరీ కష్టమే. అది ప్రతీ పెద్ద సినిమాకూ ఉన్న రిస్కే.

    దాటాలి

    దాటాలి

    ఈ సినిమా గబ్బర్ సింగ్ ని దాటేలా ఉండాలి అంటున్నారు ట్రేడ్ లో విశ్లేషకులు. అప్పుడే డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటారంటున్నారు.

    కొత్త లుక్..

    కొత్త లుక్..

    ఈ సినిమాకోసం కొత్త కొత్త సెట్ లు వేశారు...సుమారు 500 మంది ఈ సినిమా సెట్స్ కోసం పని చేసారు.

    సెట్ కే...

    సెట్ కే...

    సుమారు 5 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. అందుకే సినిమాకు కొత్త ఆ లుక్ వచ్చింది.

    విలేజ్ సెట్

    విలేజ్ సెట్


    ప్రత్యేకంగా రతన్‌పూర్‌ సెట్ ని గబ్బర్‌ కోసం నిర్మంచారు. హైదరాబాద్‌ శివార్లలో ఈ సెట్ ని కళాదర్శకుడు బ్రహ్మ కడలి పర్యవేక్షనలో చేసారు.

    పూర్తిగా మారి..

    పూర్తిగా మారి..

    ఈ సెట్ వేసిన తర్వత పవన్ నటలతో కూడా మార్పు కనిపించింది. నిజంగా రతన్ పూర్ హీరోలా మారిపోయి, సర్థార్ గబ్బర్ సింగ్ అయిపోయాడు

    పర్యవేక్షణ

    పర్యవేక్షణ

    పవన్ పర్యవేక్షనలోనే సర్థార్ సెట్ నిర్మణం జరిగింది అనడానికి ఇదే ఫ్రూఫ్. సెట్ చూస్తేనే అదిరిపోయింది, చిన్న డ్రయింగ్ రూమ్ లో వేసిన సెట్ ఇలా వుంటే, అంత పెద్దగా వేసిన సెట్ ఇంకేలా వుంటుందో.

    ట్రాక్

    ట్రాక్

    రైల్వే గేట్ సెట్, మరియు దాని క్రాసింగ్ సెట్ నిజంగా అదిరిపోయింది. అక్కడికి ట్రైన్ వస్తోందేంటీ అన్నట్టుగానే వుందీసెట్. ఒరిజినల్ ని ఇక్కడ అచ్చుగుద్దినట్టు దింపేశారు.

    స్టోరీ బోర్డ్

    స్టోరీ బోర్డ్

    చూస్తుంటే మనకు ఇంలాంటి ఇల్లు ఒకటి ఉంటే బాగున్ను అని అనిపిస్తోంది కదా, ఇది నిజానికి ఒక యానిమేషన్ స్టోరీ బోర్టు. అదిరిపోయింది కదా.

    English summary
    Sardaar Gabbar Singh's team to complete the shooting soon and release the film on April 8. Sardaar should collect anywhere around 85 crores to see its buyers in a safe zone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X