twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్చ్.. పవన్ తో పోటీ వద్దనుకున్నా...బన్నికి తప్పని తిప్పలు

    By Srikanya
    |

    హైదరాబాద్: వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా, కావాలని చేయకపోయినా..సర్దార్ సినిమా ఇప్పుడు సరైనోడు సినిమాకు సమస్యలు తెచ్చి పెడుతోందనే చెప్పాలి. రిలీజ్ డేట్ మార్పు తో మొదలైన ఈ సమస్య..ఇప్పుడు ఆడియో పంక్షన్ కాన్సిల్ దాకా వచ్చిందని ఫిల్మ్ నగర్ సమాచారం. పవన్ ఉన్న క్రేజ్ ముందు రిస్క్ చేయటం ఎందుకనే భావనే సరైనోడుని ఆలోచనలోనూ, ఇబ్బందుల్లోనూ పడేస్తోంది.

    అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'సరైనోడు'.రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. బోయపాటి శ్రీను దర్శకుడు. అల్లు అరవింద్‌ నిర్మాత. తమన్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా పాటలని వచ్చే నెల 1న నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు.

    అయితే ఎంతో భారీగా ఆడియో పంక్షన్ ప్లాన్ చేస్తారనుకున్న సమయంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది అభిమానుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం ఓ ప్రెస్ మీట్ ఇచ్చి వచ్చే నెలలో డైరక్ట్ గా మార్కెట్ లోకి ఎందుకు వస్తామని చెప్తున్నారు. కారణాలు ఏంటి అనేది ఫ్యాన్స్ లోనే కాక ఫిల్మ్ సర్కిల్స్ లోనూ ఆసక్తికర విషయమైంది.

    అయితే ఈ వాడి వేడి డిస్కషన్ లలో లలో ఈ నిర్ణయం తీసుకోవటానికి ఓ రీజన్ మాత్రం వినపడతుంది. అది మరేదో కాదు..మొదట సరైనోడు ఆడియో పంక్షన్ ని ఏప్రియల్ మొదటి వారంలో చేద్దామనుకున్నారు...కానీ సర్దార్ సినిమా రిలీజ్, ఆడియో రిలీజ్ ఈ హడావిడిలో సిని అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఉన్నప్పుడు తమ శ్రమ వృధా అవుతుందని భావించే ఈ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

    అంతేకాకుండా ..ఇంకొన్ని రీజన్స్ ..

    సోమవారం

    సోమవారం

    ఈ సోమవారం నుంచి పవన్ చిత్రం సర్దార్ కు సంభందించిన పాటలు ఎక్కడ చూసినా వినపడతాయి. అది సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం రిలీజ్ దాకా కంటిన్యూ అవుతాయి.

    రిలీజ్ తర్వాత

    రిలీజ్ తర్వాత

    సర్దార్ రిలీజ్ తర్వాత సినిమా గురించి మాట్లాడటం మొదలెడతారు. సినిమా అలా ఉంది..ఆ ఎపిసోడ్..అదిరిపోయింది..ఇలా అంతటా అదే చర్చ రన్ అవుతుంది.

    మీడియాకూడా

    మీడియాకూడా

    పవన్ కు సంభందించిన విషయం అయితే టీఆర్పీలు బాగా వస్తాయి. దాంతో పూర్తిగా సర్దార్ కు సంభందించిన విషయాలే కవర్ చేస్తుంది.

    గెస్ట్ లు రిపీట్

    గెస్ట్ లు రిపీట్

    చిరంజీవి, రామ్ చరణ్ లు సరైనోడు ఆడియో పంక్షన్ కు గెస్ట్ లుగా అనుకున్నట్లు సమాచారం. అయితే చిరంజీవి..సర్దార్ పంక్షన్ కు వస్తున్నారు. ఒకే నెలలో మరో ఆడియో పంక్షన్ లో కనపడితే ఆ ఇంపాక్ట్ తగ్గుతుందనే వాదన కూడా ఉంది.

    రిలీజ్ డేట్ మార్చారు

    రిలీజ్ డేట్ మార్చారు

    అప్పటికీ మొదట సరైనోడు చిత్రం ఏప్రియల్ 8 న వచ్చేటట్లు ప్లాన్ చేసుకున్నారు. అయితే అదే రోజు సర్దార్ కూడా ఫిక్స్ అవటంతో వెనక్కి తగ్గి వేరే డేట్ కు ఫిక్సయ్యారు.

    వెన్యూ సమస్య

    వెన్యూ సమస్య

    అంతేకాదు...హైదరాబాద్ లో పెద్ద సినిమాల ఆడియో పంక్షన్స్ లో తొక్కిసలాటలు జరుగుతున్నాయని, సెక్యూరిటీ సమస్యలతో పోలీస్ లు ఒప్పుకోవటం లేదు.

    పోనీ..ఆంధ్రాలో

    పోనీ..ఆంధ్రాలో

    ఇక్కడ కుదురటంలేదు అని ఆంధ్రాలో ఆడియో పంక్షన్ చేద్దామంటే...అభిమానులు ఎక్కువ మందికి హైదరాబాద్ అలవాటు అయ్యింది. దాంతో ఆంధ్రా నుంచి హైదరాబాద్ ఫ్యన్స్ వస్తున్నారు. కానీ నైజాం ప్రాంతం నుంచి అక్కడికి వచ్చేవారు ఉండరు.

    అల్లు అరవింద్ డెసిషన్

    అల్లు అరవింద్ డెసిషన్

    ఇలా ఆడియో విడుదల వద్దు..డైరక్ట్ గా విడుదల చేద్దాం అనే డెశిషన్ ఈ చిత్రం నిర్మాత అల్లు అరవింద్ ది అని తెలుస్తోంది. ఆయన అన్ని కోణాల్లోనూ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

    ప్రీ రిలీజ్ పంక్షన్

    ప్రీ రిలీజ్ పంక్షన్

    ఆడియో పంక్షన్ ఎలాగూ చేయటం లేదుకాబట్టి ప్రీ రిలీజ్ పంక్షన్ పెట్టుకుంటున్నారు. వైజాగ్ లో ఈ వేడుక జరగనుంది.

    నిర్మాత మాట్లాడుతూ ...

    నిర్మాత మాట్లాడుతూ ...

    ‘‘పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తమన్‌ మంచి స్వరాలిచ్చాడు. వచ్చే నెల రెండో వారంలో విశాఖపట్నంలో సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహిస్తాం. 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము''అన్నారు.

    కవర్ పేజి

    కవర్ పేజి

    ఈ సినిమాకు సంబందించిన కొత్తస్టిల్ విడుదల చేసారు. దానిని కవర్ ఫోటోగా బన్ని తన ఫేస్ బుక్ ఖాతలో పెట్టుకున్నారు. ఆ ఫోస్ట్ మీరు ఇక్కడ చూడండి.

    ఎవరెవరు..

    ఎవరెవరు..

    ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి, సాయికుమార్‌ తదితరులు నటించారు. చిత్రానికి ఛాయాగ్రహణం: రిషి పంజాబి, కళ: సాయి సురేష్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: ఎం.రత్నం, సహ నిర్మాత: శానం నాగ అశోక్‌కుమార్‌ట

    English summary
    Makers had taught that Sarrainodu audio release just a week before the release of Pawan’s movie Sardaar? Things surely would be out of control and the whole purpose of the audio launch would be wasted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X