twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకే ఐడియా, ఒకే డ్రీమ్: రాజమౌళి-షారుక్ కూడా కలిసి చేస్తారా?

    ‘బాహుబలి’ డైరెక్టర్ రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతమే అని పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'బాహుబలి' డైరెక్టర్ రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతమే అని పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇపుడు బాలీవుడ్ బాద్ షా షారుక్ కూడా ఇదే మాట అన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతం సినిమా తీయడమే అని తెలిపారు.

    ఇటీవల ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ మాట్లాడుతూ.... మహాభారతం స్టోరీని సినిమాగా తీయాలనుకుంటున్నాను కానీ, అంత బడ్జెట్‌ తన వద్ద లేదు, ఎవరైనా పెద్ద నిర్మాత తనకు తోడైతే ఈ సినిమా తీయడానికి తాను సిద్ధమే అన్నారు.

    అంతర్జాయతీ స్థాయిలో

    అంతర్జాయతీ స్థాయిలో

    మహాభారతం సినిమాగా తీస్తే అది సాదా సీదాగా తీస్తే వర్కౌట్ అవ్వుదు. భారీ బడ్జెట్ తో ఇంటర్నేసనల్ స్థాయిలో తీయాలి. నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయిలో ఉంటేనే గ్లోబల్ మార్కెట్లో సినిమా సక్సెస్ అవుతుందని షారుక్ ఖాన్ అభిప్రాయ పడ్డారు.

    బాహుబలి కంటె పెద్దగా

    బాహుబలి కంటె పెద్దగా

    ఇప్పటి వరకు ఇండియాలో బాహుబలి సినిమా పెద్ద స్కేల్ లో తీసిన సినిమా. మహాభారతం తీస్తే బాహుబలిని మించి పోయేలా ఉండాలి. సాంకేతికత పరంగా, విజువల్స్ పరంగా ఔరా అనేలా ఉండాలి అని షారుక్ ఖాన్ అన్నారు.

    మహాభారతం

    మహాభారతం

    ఇంత పెద్ద స్థాయిలో మహాభారతం సినిమా చేయాలంటే.... ఇండియన్ టాప్ స్టార్స్ షారుక్, సల్మాన్, అమీర్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ ఇలా అంతా అందులో భాగం కావాల్సి ఉంటుంది. అంతా కలిసి ఈ సినిమాకు సిద్ధం అయితే ప్రపంచస్థాయి భారీ నిర్మాణ సంస్థలు వేల కోట్ల బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతాయని....అంటున్నారు విశ్లేషకులు.

    రాజమౌళి దర్శకత్వంలోనే సాధ్యం!

    రాజమౌళి దర్శకత్వంలోనే సాధ్యం!

    బాహుబలి సినిమా భారీ స్థాయిలో తీసిన అనుభవం ఉంది కాబట్టి... రాజమౌళి దర్శకత్వంలోనే అయితేనే మహాభారతం అద్భుతం వస్తుందని, ఈ దిశగా ప్రయత్నాలు జరిగితే బావుంటుందని బాహుబలి మూవీ అభిమానుల అభిప్రాయం.

    ఒకే ఐడియా, ఒకే డ్రీమ్

    ఒకే ఐడియా, ఒకే డ్రీమ్

    రాజమౌలి, షారుక్ ఖాన్ మహాభారతం విషయంలో ఒకే ఐడియా, ఓకే డ్రీమ్ తో ఉన్నారు కాబట్టి ఇద్దరూ కలిస్తే పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడానికి ముందుకు వస్తాయి, తర్వాత సినిమాను ఏయే స్టార్స్ తో చేయాలి, ఎంత పెద్ద స్థాయిలో తీయాలి అనే విషయంలో ఓ అవగాహనకు రావడానికి వీలుంటుంది. మరి ఒకే ఐడియా ఉన్న ఈ ఇద్దరూ కలిసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడే చెప్పడం కష్టం.

    English summary
    Baahubali director SS Rajamouli is not the only one. Shah Rukh Khan also wants to make a cinematic adaptation of the Hindu epic Mahabharata.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X