twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రి సినిమాలో ఐటం సాంగ్: షాకిచ్చిన శృతి హాసన్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ ఐటం సాంగులు చేస్తూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి కమల్ హాసన్ నటిస్తున్న ‘విశ్వరూపం-2' చిత్రంలో కూడా ఐటం సాంగు చేయాలని ఆమెకు ఆఫర్ వచ్చిందట. స్వయంగా కమల్ హాసనే ఐటం సాంగ్ చేయమని ఆమెను అడిగాడని, అయితే శృతి హాసన్ ఈ ఆఫర్ తిరస్కరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తొలుత ఈ ఆఫర్‌కు ఆమె ఒప్పుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ నో చెప్పి షాకిచ్చింది శృతి.

    అయితే శృతి హాసన్ ఈ వార్తలను ఖండించింది. తనకు తన తండ్రి నటిస్తున్న ‘విశ్వరూపం-2' చిత్రంలో ఎలాంటి ఆఫర్ రాలేదని...తన తండ్రితో కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తెలిపారు. భవిష్యత్తులో తప్పకుండా ఆయనతో కలిసి నటిస్తానని, మంచి స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

    Shruti Haasan rejects Viswaroopam 2 offer

    కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం-2' వస్తున్న సంగతి తెలిసిందే. విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్‌ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. ఇప్పుడు విశ్వరూపం-2ని తీర్చిదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు కమల్‌. త్వరలో ఈచిత్రం విడుదల కానుంది.

    విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిందని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.

    English summary
    Buzz is Kamal Hasan's Viswaroopam 2 has a item song and Kamal asked Shruti Haasan to do the song. However sources say Shruti rejected it. However Shruti as usual rubbished those rumours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X