twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు మూవీకి కోర్టు నోటీసులు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లోనే భారీ హిట్ చిత్రంగా ఇటీవల విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం నిలిచన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన వెంటనే అప్పట్లో ఓ వివాదం తెరపైకి వచ్చింది. తన కథను కాపీ కొట్టి సినిమా తీసారని ఆరోపణలు చేసాడు శరత్ చంద్ర అనే వ్యక్తి. జర్నలిస్ట్‌గా పనిచేసిన శరత్ చంద్ర 2012 లో స్వాతి అనే ప్రముఖ వారపత్రిక లో 'చచ్చేంత ప్రేమ' అనే పేరుతో ఓ సీరియల్ రాసానని.. అదే కథ ని శ్రీమంతుడు గా తీసారని అప్పట్లో ఆరోపించారు.

    Also Read: నేనే ఎప్పూడూ ఊహించని రోజు ఇది: మహేష్ బాబు (ఫోటోస్)

    తాజాగా ఈ ఇష్యూపై సదరు శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు నవీన్ యర్నేని, రవి శంకర్, సివి మోమన్ లతో పాటు...ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ లో నటించబోతున్న హృతిక్ రోషన్‌కు నోటీసులు అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమాను హిందీలో రీమేక్ కాకుండా స్టేఇవ్వాలని కోరారు. ఈ మేరకు నోటీసులు జారీ చేసిన కోర్టు మార్చి 4వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

    Also Read: అదే ఫిక్సైతే... 'బ్రహ్మోత్సవం' ఓవర్ సీస్ లో పెద్ద దెబ్బే

    Srimanthudu In Legal Trouble?

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "శ్రీమంతుడు" సినిమా మంచి కధ తో, మంచి పాటలతో, గ్రామ దత్తత అనే మంచి పాయింట్‌తో ఎంతో కనెక్టివ్ గా డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా తెలుగు వారి హృదయాలకు తమ తమ గ్రామ మూలాలను గుర్తు చేసింది. ఈ సినిమా భారీ విజయం సాధించడానికి కారణం ఇదే.

    ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న సినిమా 'బ్రహ్మోత్సవం'. గతంలో తనకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి మంచి విజయాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో ఈ సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ వారు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

    English summary
    Film Nagar Source said that, the City Civil Court issued notices to the makers of Superstar Mahesh Babu's blockbuster film, Srimantudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X