twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ షార్ట్ పిల్మ్ మేకరే...ప్రభాస్ నెక్ట్స్ సినిమా డైరక్టర్

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రభాస్ తదుపరి చిత్రం ఏం చేయబోతున్నారనేది ప్రభాస్ అభిమానుల్లోనే కాక సినీ అభిమానుల్లోనూ ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే రాజమౌళి తో చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి తర్వాత చేయబోయే చిత్రం ఎంపిక చాలా క్లిష్టమైనది. అయితే ఆల్రెడీ ప్రభాస్ ... కథ విని డైరక్టర్ ని ఓకే చేసేసాడని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు నెట్ జనులకు షార్ట్ ఫిల్మ్ మేకర్ గా...బయిట జనాలకు రన్ రాజా రన్ దర్శకుడుగా పరిచయం అయిన సుజీత్.

    ప్రభాస్ కజిన్ ప్రమోద్ ఉప్పలపాటి కో ప్రొడ్యూసర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ కృష్ణా రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తారు.మిస్టర్ ఫెరఫెక్ట్, వర్షం చిత్రాల తరహా కథతో ఈ చిత్రం ఉండబోతోందని, రన్ రాజా రన్ తరహా ఫ్రెష్ నేరేషన్ తో సబ్జెక్టుని డీల్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సుజీత్ ఇప్పటివరకూ 50కు పైగా షార్ట్ ఫిలింలు చేసారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

    ఇక ప్రభాస్ తాజా చిత్రం బాహుబలి లేటెస్ట్ ఇన్ఫో...

    Sujeeth Sen to Direct Prabhas's Next

    చారిత్రాత్మక కథతో రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ బాహుబలి '. ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా తమ్ముడిగా భళ్లాల దేవుడి పాత్రలో రానా నటిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య భారీ పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌. దీనికోసం రామోజీ ఫీలింసిటీలో భారీ సెట్‌ను వేశారు. ఈనెలఖారు వరకు ఈ సన్నివేశాలు కొనసాగుతాయి.

    తెలుగు చలన చిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందుతున్న సినిమా కావడంతో ఫైట్‌ సన్నివేశాన్ని పీటర్‌హెయిన్స్‌తో పాటు రాజమౌళి సవాలుగా తీసుకున్నారని ఫిలింనగర్‌ సమాచారం. అనుష్క, తమన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ లాంటి సీనియర్లు నటిస్తున్నారు.

    అలాగే...ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ ఇన్ఫోని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే... వాట్స్ అప్ యాప్ లో దొరుకుతుందని చెప్తున్నారు. ఈ మేరకు 809675522 నెంబర్ ని విడుదల చేసారు. ఈ నెంబర్ ని మీరు వాట్సప్ లో యాడ్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు చిత్రం గురించి ఎక్లూజివ్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు.

    ఇక ...

    కవచాలు, శిరస్త్రాణం ధరించి, కరవాలం చేతపట్టి యుద్ధరంగంలో శత్రువులను చీల్చిచెండాడే యోధుడిగా ప్రభాస్‌ తాజా పోస్టర్‌లో దర్శనమిచ్చారు. 'మేకింగ్‌ ఆఫ్‌ బాహుబలి' పేరుతో ఇప్పటికే పలు వీడియోలను చిత్రం బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

    'బాహుబలి' గా ప్రభాస్‌ రూపమేంటో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. తొలి రూపు (ఫస్ట్‌లుక్‌)తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రెండో పోస్టరును విడుదల చేశారు. ఈ రెండు ఈ వీరుడి సాధారణ రూపాలు. మరి యుద్ధభూమిలో 'బాహుబలి' ఎలా ఉండబోతున్నాడు అనే ఆతృత అందరిలోనూ కలిగింది. ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.

    రాజమౌళి కొత్త ఆలోచన:

    లైవ్‌ యాక్షన్‌ సినిమా, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత సినిమా.. ఈ రెండింటికీ మధ్య తేడాలున్నాయి. కెమెరా ముందు జరుగుతున్న సన్నివేశాన్ని యథాతథంగా చూపించడం లైవ్‌ యాక్షన్‌ సినిమా. ఖాళీ ప్రదేశంలో బ్లూమేట్‌ ముందు చిత్రీకరించి ఆ తర్వాత దానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడించి ఏ పెద్ద కోట లోపలో, లేదా కోట ముందో ఉన్నట్లు చూపించడం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత చిత్రమవుతుంది. రెండో రకం చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎదురుగా ఏమీ లేకుండానే ఉన్నట్లు భావించి నటించాల్సి వస్తుంది.

    ఇలాంటి సన్నివేశాలకు దర్శకత్వం వహించడం కష్టసాధ్యమైన పనే. అందుకే బ్లూమేట్‌ ఆధారంగా తీసే సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే కళ్లకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కనపడేలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి. ఆయన తాజా చిత్రం 'బాహుబలి' కోసం ఏఎండీ అనే విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థతో కలసి పని చేస్తున్నారు. ఈ పనిలో మరో సంస్థ మకుట కూడా పాలుపంచుకుంటోంది. ఏఎండీ తాజాగా ఓ మైక్రోచిప్‌ తయారు చేసే పనిలో ఉందట.

    ఓ చిప్‌లో మొత్తం ఎఫెక్ట్స్‌ను అప్‌లోడ్‌ చేసి దాన్ని కళ్లజోడుకు జోడించి చూస్తే బ్లూమేట్‌ మీద ఏమైతే విజువల్‌ ఎఫెక్ట్స్‌ని మిక్స్‌ చేస్తారో.. అవి కనిపిస్తాయి. దీని వల్ల చిత్రీకరణ సులభతరమవుతుంది. రాజమౌళి అయితే వీలైనంత త్వరలో ఈ సాంకేతికత అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు. ఈ విషయం గురించి రూపొందించిన వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టారు.

    English summary
    Prabhas is going to act under direction of Sujjeth who made impressive debut with run Raja Run.Prabhas cousin Pramod Uppalapati who earlier produced Mirchi and Run Raja Run will co-produce the movie in association with Vamsi Krishna Reddy under UV Creations Banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X