Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జూ ఎన్టీఆర్ సినిమాలో శృంగార తార సన్నీ లియోన్?
హైదరాబాద్: పూరి జగన్నాథ్ సినిమాల్లో ఐటం సాంగులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. హాట్ అండ్ సెక్సీ బ్యూటీస్ ఒంపుసొంపుల ప్రదర్శనతో చాలా హాట్‌గా ఉంటాయి ఆ సాంగులు. ఇందుకు ఆయన గత సినిమాలే నిదర్శనం. ముమైత్ ఖాన్‌ను ఐటం గర్ల్‌గా ఓ రేంజికి తీసుకెళ్లింది పూరి జగన్నాథే.
తాజాగా యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలోని ఐటం సాంగులో తన మార్కు కనిపించేలా పూరి జగన్నాథ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాజీ పోర్న్ స్టార్, శృంగార తార సన్నీ లియోన్‌తో ఐటం సాంగ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాస్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతోన్న ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఫైట్ సీన్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంటుందట. హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉండే ఈ చేజింగ్ అండ్ ఫైటింగ్ సీన్ కోసం ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట.
ఈ చిత్రానికి వక్కతం వంశీ కథ అందిస్తున్నారు. పూరి జగన్నాధ్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ని జోడించాడు. గతంలో వక్కంతం వంశీ..ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి చిత్రాలకు కథలు అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.