twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ స్టార్ కృష్ణను గవర్నర్‌గా చూడబోతున్నామా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. త్వరలో ఆయన్ను అభిమానులు గవర్నర్ గా చూడబోతున్నారట. ఓ చిత్రంలో గవర్నర్ పాత్రలో నటించబోతున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఇటీవల ఓ ప్రముఖ దర్శకుడు తన సినిమాలో గవర్నర్ పాత్రలో నటించమని కృష్ణను సంప్రదించారట. అయితే కృష్ణ ఇంకా తన నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. ఆయన అంగీకరిస్తే అభిమానులకు ఆయన్ను మళ్లీ తెరపై చూసే భాగ్యం లభిస్తుంది.

    వయసు పైబడటంతో కృష్ణ చాలా కాలంగా సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 72 సంవత్సరాలు. అప్పుడప్పుడూ ఏదైనా సినిమా స్టార్ల సంబంధించిన కార్యక్రమాలకు తప్ప పెద్దగా బయట కనిపించడం లేదు. మరి ఆయన గవర్నర్ పాత్రలో చేయడానికి ఇప్పుకుంటారో? లేదో? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    సూపర్‌ స్టార్‌ కృష్ణగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ.! ఈయన 1942వ సంవత్సరం మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు. సినీరంగంలో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న మనసున్న మనిషిగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు.

    Superstar Krishna to act in Governor role

    కృష్ణ తేనెమనసులు అనే చిత్రంలో నటించి సినీరంగ ప్రవేశం చేసారు. సాహసానికి మారుపేరుగా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఎందరో తలపెట్టి సాధ్యంకాక వదిలేసిన అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్ని మరీ నిర్మించి తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఓఅద్భుతమైన హిట్‌ను అందించారు.

    ఇంగ్లీష్ సినిమాల్లో మాత్రమే కనిపించే కౌబోయ్‌ పాత్రలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారాయన. ఆ తరవాతి కాలంలో మరిన్ని కౌబోయ్ చిత్రాలు వచ్చినా అవేమీ 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా మించి ఉండకపోవడం గమనార్హం. అలాగే మాములు కుటుంబ కథాచిత్రాల స్థాయికి ఎంతో ఎత్తులో ఉండేలా 'పండంటి కాపురం' చిత్రనిర్మాణం జరగడం కృష్ణ ఆలోచనకు ఫలితమే. ఈ సినిమా కలెక్షన్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి.
    సోషల్ క్రైమ్ సినిమాని 'ఫ్యామిలీ సినిమా' అనే ఫీలింగ్ 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంతో కలిగించారు. నష్టపోయిన నిర్మాతలకు పారితోషికం గురించి పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ డేట్స్ ఇచ్చి ఆదుకునేవారాయన. తను నటించే సినిమా భవిష్యత్ గురించి, అది ఆడుతుందా? ఆడదా? కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పేవారు.

    కౌబాయ్‌ హీరోగా ప్రసిద్ది చెందిన ఈ సూపర్‌ స్టార్‌ రాజకీయ రంగప్రవేశం చేసి విజయఢంకా మోగించారు. దాదాపు 350 చిత్రాల్లో నటించిన కృష్ణ నటుడిగా మత్రమే కాకుండా, దర్శకడిగా, నిర్మాతగా కూడా రాణించి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. కృష్ణ వారసుడిగా ఇప్పుడు మహేష్ బాబు తెలుగు సిని పరిశ్రమ నెం.1 స్థాయి హీరోగా తండ్రిని మించిన తనయుడు అని నిరూపించాడు.

    English summary
    Film Nagar source said that, Superstar Krishna to act in Governor role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X