twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ కి విలన్ గా రానా ఎంపిక?

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాహుబలి చిత్రం తర్వాత దగ్గుపాటి రానా కు ప్రేక్షక వర్గంలో మంచి పేరు వచ్చింది. హీరోయిజం పండించే పాత్రలు కన్నా నెగిటివ్ రోల్స్ అయితే సమర్దవంతంగా చేయగలడని టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నమ్ముతున్నారు. అందులో భాగంగా తాజాగా రానాని ...రామ్ చరణ్ తదుపరి చిత్రంలో విలన్ గా అడుగుతున్నట్లు సమాచారం. తమిళంలో అరవింద్ స్వామి చేసిన పాత్రకు గానూ రానా అయితే ఫెరఫెక్ట్ గా సూట్ అవుతాడని అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటా అంటే తమిళంలో విజయవంతంగా ఆడుతున్న 'తని ఒరువన్‌' రీమేక్.

    కొద్ది రోజుల క్రిందట విడుదలై సూపర్ టాక్ తో దూసుకుపోతున్న ' 'తని ఒరువన్‌'' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ తో చేయటానికి రంగం సిద్దమయినట్లే అని తెలుస్తోంది. ఈ చిత్రం రైట్స్ ని ఐదున్నర కోట్లకు పొందినట్లు సమాచారం. తమిళంలో డైరక్ట్ చేసిన దర్శకుడు మోహన్ రాజానే ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసేటట్లు ఒప్పందం కుదిరింది. అలాగే దర్శకుడుకి రెమ్యునేషన్ ఐదు కోట్లు మించకుండా ఉండాలని కండీషన్ పెట్టినట్లు, అంతేకాకుండా మొత్తం బడ్జెట్ 25 కోట్లు లోపల అవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం 8-9 కోట్లు వరకూ అడిగారని, అయితే నిర్మాత ఎన్.వి ప్రసాద్ కు ఉన్న రిలేషన్ తో ఈ ప్రాజెక్టుని ఫైనల్ అయినట్లు చెప్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    'Thani Oruvan' remake :Rana to fight with Ram Charan?

    కథేంటి... మిత్రన్ ('జయం' రవి), అతని స్నేహితులు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్. డ్యూటీలో చేరక ముందే తమ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూంటారు. మిత్రన్ ప్రేయసి మహిమ (నయనతార) కూడా వాళ్లతో చేతులు కలుపుతుంది. ఈ క్రమంలోనే ఓ సామాజిక కార్యకర్త వీళ్ల కళ్లముందే హత్యకు గురవుతాడు. ఇలాగే వరుస హత్యలు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత హత్యలుగా వాళ్లు గుర్తిస్తారు.

    ఫైనల్‌గా ఇదంతా ఫేమస్ సైంటిస్ట్ సిద్ధార్థ్(అరవింద స్వామి) చేస్తున్నాడని తెలుసుకుంటారు. చివరకు సిద్ధార్థ్ధ్‌ను వాళ్లు ఎలా ఎదిరించారన్నది మిగిలిన కథాంశం. తమిళంలో చివరి 'నెగటివ్' సినిమా! ఈ సినిమా ఇప్పటికే వసూళ్లు కొల్లగొడుతూంటే, మరో రూపంలో ఇది చరిత్రలో నిలిచిపోనుంది. తమిళంలో 'నెగటివ్' వాడిన చివరి సినిమా ఇదే.

    మొత్తం హిందీ, కన్నడ, తెలుగు చిత్ర సీమలను తన వైపు తిప్పుకున్న ఆ చిత్రం పేరు 'తని ఒరువన్'. 'దృశ్యం' తర్వాత మళ్లీ ఓ హాట్ కేక్. మలయాళ 'దృశ్యం' ఇప్పటికే అయిదు భాషల్లో రీమేక్ అయి విజయం సాధించింది. మళ్లీ ఆ సినిమా తర్వాత 'తని ఒరువన్' హాట్ కేక్‌లా మారింది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ చేయాలని హేమాహేమీలు ప్లాన్ చేస్తున్నారు.

    'Thani Oruvan' remake :Rana to fight with Ram Charan?

    తెలుగు నుంచి రామ్‌చరణ్,హిందీ నుంచి సల్మాన్‌ఖాన్, కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక హీరోయిన్ జెనీలియాకు ఈ సినిమా తెగ నచ్చేసి మరాఠీ వెర్షన్‌లో హీరోయిన్‌గా నటించడానికి సై అన్నారు. బెంగాలీ వెర్షన్ రీమేక్ హక్కుల గురించి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. బాలీవుడ్ విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ఈ సినిమా చూడలేదు కానీ, ఆయన ప్రొడక్షన్ యూనిట్ ఇప్పటికే ఈ సినిమా చూసి, రీమేక్ రైట్స్ తీసుకోవటం కోసం డిస్కషన్స్ మొదలుపెట్టారని చెప్తున్నారు.

    ఆగస్టు 28... శుక్రవారం. తమిళనాట ఓ సినిమా రిలీజైంది. ఎవ్వరికీ పెద్ద అంచనాల్లేవ్. హీరో 'జయం' రవి. దర్శకుడు ఎం.రాజా. వాళ్లిద్దరూ అన్నదమ్ములు. హీరోయిన్ నయనతార. మార్నింగ్ షో చూసి ఆడియన్స్ షాక్. స్టోరీ, టేకింగ్ చూసి థ్రిల్లైపోయారు. ఇక అక్కణ్నుంచీ థియేటర్లన్నీ హౌస్‌ఫుల్. చూసిన వాళ్లు, మళ్లీ మళ్లీ చూస్తున్నారు. చూడనివాళ్లు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

    కోలీవుడ్‌లో రాణిస్తున్న తెలుగు సోదరులు జయంరాజా, రవి. దర్శకుడు, నటుడిగా ఇప్పటి వరకు రీమేక్‌ చిత్రాలతో వచ్చిన వీరు.. తొలిసారిగా 'తని ఒరువన్‌'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్‌గానూ ఈ చిత్రం వసూళ్లు రాబడుతోంది. నయనతార, అరవింద్‌స్వామి, నాజర్‌, తంబిరామయ్య తదితరుల నటన కూడా సినిమాకు ప్లస్‌పాయింట్‌గా మారింది. చిత్ర విజయోత్సవ వేడుక చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.

    జయంరాజా మాట్లాడుతూ.. ''నా వద్దకు వచ్చే నటులందరూ రీమేక్‌ చిత్రాలను తెరకెక్కిస్తే చేయడానికి సిద్ధమే అంటున్నారు. ఇన్ని సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ.. నన్ను నేరు చిత్ర దర్శకుడిగా ఎవరూ గుర్తించలేదు. నేను ఆ స్థాయివాణ్ని కాకపోయినప్పటికీ.. సొంతంగా సినిమాకు దర్శకత్వం వహించగలను. ఆ నమ్మకంతోనే 'తని ఒరువన్‌'తో తొలివిత్తు నాటాను. ఇప్పుడు అది మహావృక్షంగా నాకు ఎనలేని సంతోషాన్ని పంచుతోంది''అని ఉద్వేగానికి గురయ్యారు. దీంతో వేదికపై ఉన్న తమ్ముడు జయంరవికి కూడా కళ్లు చెమ్మగిల్లాయి.

    అనంతరం జయంరవి మాట్లాడుతూ.. ''గతంలో నా విజయాన్ని చూసి అన్న గర్వపడేవారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రీమేక్‌ చిత్రాలన్నీ నాకే గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు దర్శకుడిగా ఆయన గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవడం నాకు గర్వంగా ఉంది. మా అన్న చాలా సీరియస్‌ దర్శకుడన్న విషయం ఈ చిత్రం ద్వారా తేటతెల్లమైంద''ని చెప్పారు.

    English summary
    Rana may lock horns with Ram Charan. Ram Charan who is currently starring in Bruce Lee is planning to star in the remake of Tamil hit Thani Oruvan. Filmmakers earlier planned to cast Aravind Swamy in the remake but with him not showing interest,they are now roping in Rana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X