twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ రీమేక్... ' 'తని ఒరువన్‌'' ఎంతకి కొన్నారంటే

    By Srikanya
    |

    హైదరాబాద్ : కొద్ది రోజుల క్రిందట విడుదలై సూపర్ టాక్ తో దూసుకుపోతున్న ' 'తని ఒరువన్‌'' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ తో చేయటానికి రంగం సిద్దమయినట్లే అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం రైట్స్ ని ఐదున్నర కోట్లకు పొందినట్లు సమాచారం. తమిళంలో డైరక్ట్ చేసిన దర్శకుడు మోహన్ రాజానే మొదట ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసేందుకు అనుకున్నారు. అయితే చివరి నిముషంలో సురేంద్ర రెడ్డి సీన్ లోకి వచ్చారు. మొదట ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం 8-9 కోట్లు వరకూ అడిగారని, అయితే చిరంజీవి సీన్ లోకి వచ్చి ఎడిటర్ మోహన్ తో మాట్లాడటంతో ఈ ప్రాజెక్టుని ఫైనల్ అయినట్లు చెప్తున్నారు.

    బ్రూస్ లీ మూవీతో ఆడియెన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్... ఈ సినిమా తరువాత కోలీవుడ్ హిట్ మూవీ 'తని ఒరువన్' రీమేక్ లో నటిస్తున్నారు. నిర్మాత దానయ్య ఈ హిట్ సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ కోసమే భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేశాడని...ఈ ఏడాదిలోనే ఈ రీమేక్ మూవీ సెట్స్ మీదకు వెళ్లొచ్చని వినిపిస్తోంది. ఈ సినిమాకు మెగా ఫోన్ పట్టుకునేది సురేంద్రరెడ్డి అనే క్లారిటీ రావటంతో... హీరోయిన్ గా సమంత పేరు దాదాపుగా ఖరారైందని ప్రచారం మొదలైంది దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా హిట్టే అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కథేంటి... మిత్రన్ ('జయం' రవి), అతని స్నేహితులు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్. డ్యూటీలో చేరక ముందే తమ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూంటారు. మిత్రన్ ప్రేయసి మహిమ (నయనతార) కూడా వాళ్లతో చేతులు కలుపుతుంది. ఈ క్రమంలోనే ఓ సామాజిక కార్యకర్త వీళ్ల కళ్లముందే హత్యకు గురవుతాడు. ఇలాగే వరుస హత్యలు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత హత్యలుగా వాళ్లు గుర్తిస్తారు.

    Thani Oruvan Remake: rights for big price

    ఫైనల్‌గా ఇదంతా ఫేమస్ సైంటిస్ట్ సిద్ధార్థ్(అరవింద స్వామి) చేస్తున్నాడని తెలుసుకుంటారు. చివరకు సిద్ధార్థ్ధ్‌ను వాళ్లు ఎలా ఎదిరించారన్నది మిగిలిన కథాంశం. తమిళంలో చివరి 'నెగటివ్' సినిమా! ఈ సినిమా ఇప్పటికే వసూళ్లు కొల్లగొడుతూంటే, మరో రూపంలో ఇది చరిత్రలో నిలిచిపోనుంది. తమిళంలో 'నెగటివ్' వాడిన చివరి సినిమా ఇదే.

    రామ్ చరణ్ మాట్లాడుతూ...ఇదివరకు రీమేక్‌ సినిమాలు చేయకూడదు అనుకొనేవాణ్ని. కానీ అలాంటి నిబంధనలేవీ పెట్టుకోకూడదనే ఓ నిర్ణయానికొచ్చా. 'తని ఒరువన్‌' నాకు బాగా ఇష్టం. అందులో హీరో పాత్ర కంటే విలన్ పాత్ర చాలా ముఖ్యం. ఆ పాత్రకి తగ్గ నటుడు దొరికితే వెంటనే సినిమాని మొదలుపెడతాం. ఆ తర్వాత గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమాని చేయబోతున్నా. అదొక ప్రేమకథతో తెరకెక్కబోతోంది.

    అలాగే...పవన్‌కల్యాణ్‌ నిర్మాణంలో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు అంటే...ఇటీవలే నేను, బాబాయ్‌ కలిసి మాట్లాడుకొన్నాం. వచ్చే ఏడాది ఆ సినిమా ఉంటుంది.మీ నాన్న, మీ బాబాయ్‌, మీరు... ముగ్గురూ కలిసి నటించే అవకాశాలేమైనా ఉన్నాయా?అలాంటి కలయికలో సినిమా వస్తే బాగుంటుంది. కానీ ముగ్గురూ కలిసి నటించాలంటే అందుకు దీటైన కథ కావాలి. ఇప్పటిదాకా ఏ దర్శకుడూ అలాంటి ప్రతిపాదనతో మా దగ్గరికి రాలేదు. ఒకవేళ వస్తే, కథ బాగుంటే తప్పకుండా చేస్తాం అన్నారు.

    మొత్తం హిందీ, కన్నడ, తెలుగు చిత్ర సీమలను తన వైపు తిప్పుకున్న ఆ చిత్రం పేరు 'తని ఒరువన్'. 'దృశ్యం' తర్వాత మళ్లీ ఓ హాట్ కేక్. మలయాళ 'దృశ్యం' ఇప్పటికే అయిదు భాషల్లో రీమేక్ అయి విజయం సాధించింది. మళ్లీ ఆ సినిమా తర్వాత 'తని ఒరువన్' హాట్ కేక్‌లా మారింది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ చేయాలని హేమాహేమీలు ప్లాన్ చేస్తున్నారు.

    తెలుగు నుంచి రామ్‌చరణ్,హిందీ నుంచి సల్మాన్‌ఖాన్, కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక హీరోయిన్ జెనీలియాకు ఈ సినిమా తెగ నచ్చేసి మరాఠీ వెర్షన్‌లో హీరోయిన్‌గా నటించడానికి సై అన్నారు. బెంగాలీ వెర్షన్ రీమేక్ హక్కుల గురించి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. బాలీవుడ్ విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ఈ సినిమా చూడలేదు కానీ, ఆయన ప్రొడక్షన్ యూనిట్ ఇప్పటికే ఈ సినిమా చూసి, రీమేక్ రైట్స్ తీసుకోవటం కోసం డిస్కషన్స్ మొదలుపెట్టారని చెప్తున్నారు.

    English summary
    Ram Charan decided to star in the re-make of the film in Telugu under the direction of Surender Reddy. It is coming out that the remake rights have been bagged for a fancy sum of Rs 5.5 crs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X