twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చక్రి భార్య వేధింపులు...సినీ పెద్దలు రంగంలోకి

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకులు చక్రి సతీమణి శ్రావణి తనను అత్తింటి వారు వేధిస్తున్నారంటూ మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే చక్రి మరణం జరిగిన రెండు రోజులుకే ఇలాంటి చేదు సంఘటనలు చోటు చేసుకోవటంతో చక్రి శ్రేయాభిలాషులుగా ఉన్న కొంత మంది సినిమా పెద్దలు కలత చెందనట్లు సమాచారం. వారు రంగంలోకి దిగి ఆమెను ఈ విషయమై మీడియా వద్ద ఎక్కువ మాట్లాడవద్దని, అది చక్రి ప్రతిష్టకే భంగం వాటిల్లుతుందని, కుటుంబ సమస్యలు ఏదన్నా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోమని, అవసరమైతే తమ సహాయం తప్పకుండా ఉంటుందని సూచించినట్లు సమాచారం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె మీడియా వద్ద ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక కుటుంబ పరంగా ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు దారి తీయకూడదనే మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించానని ప్రముఖ సంగీత దర్శకులు చక్రి సతీమణి శ్రావణి తెలిపారు. చక్రి కన్నుమూసిన నాటినుంచి కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు తనను బాధించాయని మీడియాకు తెలిపారు.

    Tollywood on Chakri's wife issue

    గుండెపోటుతో చక్రి మరణించి మూడు రోజులు కావడంతో జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీలో బుధవారం మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణి మీడియాతో మాట్లాడుతూ.. 'రెండు రోజులుగా మా కుటుంబంలో జరుగుతున్న పరిణామాలతో నా భవిష్యత్తుపై కొంత భయం కలిగింది. ఆ ఆలోచనతో తన స్వీయరక్షణ కోసం హెచ్‌ఆర్సీని ఆశ్రయించాల్సి వచ్చింది. నిన్న ఆస్తులకు సంబంధించి గొడవ చోటుచేసుకుంది.

    దీనికి తోడు మృతదేహం ఉండగానే మా అత్తింటివారు ఇంట్లోని అన్ని అల్మారాలకు తాళాలు వేసుకున్నారు. కొందరు వచ్చి మాట్లాడాక కొన్ని అల్మారాల తాళాలు మాత్రం ఇచ్చారు. 11 రోజుల కార్యక్రమం పూర్తయ్యేక మా ఇరువురు కుటుంబాలు కలిసి మాట్లాడుకుంటాం. అంత వరకు అందరూ సహకరించాలి' అని శ్రావణి వివరించారు.

    ఈ సందర్భంగా చక్రి సోదరుడు మహత్‌ నారాయణ మాట్లాడుతూ 'ఈ మూడు రోజుల్లో కొన్ని అనుకోని సంఘటలు చోటుచేసుకోవడం దురదృష్టకరం. మా అన్నయ్య బంగారు కొండ. ఆయన ఆశయ సాధనకోసం మేమంతా కృషిచేయాల్సి ఉంది. ఏమైన సమస్యలుంటే కుటుంబపరంగా అందరూ కూర్చుని పరిష్కరించుకుంటామని' పేర్కొన్నారు.

    English summary
    Family Members of Chakri have been harassing his wife ever since the composer passed away. Chakri's Wife, however, refused to respond on the issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X