»   » విశాల్‌కు దూరమైన వరలక్ష్మి.. అతని ప్రత్యర్థి శింబు కి దగ్గరవుతోందా? ఈ ఫోటోలూ..

విశాల్‌కు దూరమైన వరలక్ష్మి.. అతని ప్రత్యర్థి శింబు కి దగ్గరవుతోందా? ఈ ఫోటోలూ..

లేటెస్ట్ గా వరలక్ష్మి శింబు ఇచ్చిన విందులో పాల్గొని అతనితో కలిసి చిందులు వేయడం అందరికి షాక్ ఇచ్చింది. పైగా ఈ కార్యక్రమంలో మరో హాట్ భామ త్రిష కూడా పాల్గొంది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

తమిళ హీరోయిన్ వరలక్ష్మి అంటే తెలుసా? ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు ... కానీ హారో విశాల్ లవర్ అంటే మాత్రం అందరు గుర్తు పడతారు? స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విశాల్ లవర్ గానే పాపులర్ అయింది. ఈ మధ్య విశాల్, వరలక్ష్మి ల మధ్య ఎందుకు చెడిందో తెలియాదు కానీ ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. లేటెస్ట్ గా వరలక్ష్మి ...

శింబు ఇచ్చిన విందులో పాల్గొని అతనితో కలిసి చిందులు వేయడం అందరికి షాక్ ఇచ్చింది. పైగా ఈ కార్యక్రమంలో మరో హాట్ భామ త్రిష కూడా పాల్గొంది. విశాల్ బ్రేక్ అప్ తరువాత వరలక్ష్మి శింబుతో అంత క్లోజ్ గా ఉండడం .. ఆసక్తిని రేకెత్తిస్తుంది. నడిగర్ సంగం విషయంలో కూడా శింబు, విశాల్ కు అపోజిట్ గానే ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మి కూడా శింబుతో ఉండడం చర్చలకు దారి తీస్తోంది !!

వరలక్ష్మీతో విశాల్ ప్రేమలో:

ఈ మధ్య జరిగిన నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో విశాల్ వ్యతిరేక వర్గానికి శింబు మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల త‌ర్వాత విశాల్ ఒక్క‌సారిగా త‌మిళంతో పాటు సౌత్‌లో సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు. కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీతో విశాల్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు వెలువడ్డాయి.

ప్రేమ, పెళ్లి అంతా సినిమాతోనే:

దీంతో విశాల్‌-వ‌ర‌ల‌క్ష్మి జంట త్వరలో ఒక్కటవబోతోందని అందరూ చెవులు కొరుక్కున్నారు. ఈ సమయంలో మీడియా ముందుకు వచ్చిన వరలక్ష్మీ.. తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలు మొత్తం అబద్ధాలని, తన ప్రేమ, పెళ్లి అంతా సినిమాతోనే అని చెప్పుకొచ్చింది.

తమిళ స్టార్ హీరో విశాల్:

ఎక్క‌ువ కాలం ప్రేమించుకుంటుంటే... ఆ ప్రేమ పెళ్ళి వ‌ర‌కు చేర‌దంటారు... విశాల్, వ‌ర‌ల‌క్ష్మిల విష‌యంలో ఇదే జ‌రిగిన‌ట్లుంది. తమిళ స్టార్ హీరో విశాల్, వ‌ర‌ల‌క్ష్మిల ప్రేమాయ‌ణం కథ కంచికి చేరినట్టుంది. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, విశాల్ లు గత ఏడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఆ మధ్య తమిళ నడిఘర్ సంఘం నిర్మించే పెళ్ళి మంటపంలో మొట్టమొదటి పెళ్ళి మాదే అని విశాల్ ప్రకటించాడు.

ప్రేమకథకి ముగింపు:

అయితే ఇప్పుడు వరలక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో ఏడేళ్ళ బంధాన్ని ఓ వ్యక్తి తేలికగా తీసుకుంటున్నాడని, ప్రేమ పరిహాసంగా మారుతోందని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో ఇక విశాల్, వరలక్ష్మి ప్రేమకథకి ముగింపు అనుకున్నారంతా. కానీ, ఇది కేవలం ట్వీట్ మాత్రమే. ప్రస్తుతం నేను వర్క్ మీద దృష్టి పెడుతున్నాను అని మళ్ళీ ట్వీట్ చేసింది వరలక్ష్మి.

తండ్రి సైడ్ తీసుకున్న వరలక్ష్మి మాత్రం:

విశాల్‌-వ‌ర‌ల‌క్ష్మీ ప్రేమ వ్య‌వ‌హారం శ‌ర‌త్‌కుమార్‌కు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే వీరిద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెరిగి చివ‌ర‌కు అది న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో విశాల్ శ‌ర‌త్‌కుమార్‌పై స‌వాల్ చేసే స్థాయి వ‌ర‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్కడితోనే ఈ ప్రేమికుల మధ్య కూడా దూరం పెరగటం మొదలయ్యింది. విశాల్ సరిగ్గనే ఉన్నా తండ్రి సైడ్ తీసుకున్న వరలక్ష్మి మాత్రం ఇక ఈ బందానికి ఫుల్స్టాప్ పెట్టాల్సిందే అని నిర్ణయించుకుండంటూ వార్తలు వచ్చాయి.

ఆసక్తికరమైన ఫొటో:

శరత్‌కుమార్‌ అంటే విశాల్‌కి పడదు. ఇద్దరి మధ్యా తమిళ సినీ రాజకీయాల పరంగా ఎన్నో వివాదాలున్నాయి. 'నువ్వెంత..' అని విశాల్‌ అంటే, 'నువ్వుంత..' అని శరత్‌కుమార్‌ సవాల్‌ విసిరిన, విసురుకున్న సందర్భాలున్నాయి. ఈ వివాదాల కారణంగానే ఆ మధ్య శరత్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ టైమ్‌లోనే, తన ప్రేమ గురించి విశాల్‌ సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫొటో పెట్టాడు కూడా.

విమర్శల్ని ఎదుర్కొన్నాడు:

ఈ ఫోటోలోనే వుంది అంతా..' అంటూ వరలక్ష్మితో క్లోజ్‌గా వున్న ఫొటోని సోషల్‌ మీడియాలో పెట్టి, 'అసందర్భం.. అమానవీయం..' అనే విమర్శల్ని విశాల్‌ ఎదుర్కొన్నాడు. తాజాగా, విశాల్‌ తన పుట్టినరోజు వేడుకల్ని వెరైటీగా జరుపుకున్నాడు. వరలక్ష్మితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి, అక్కడ కొత్తగా జన్మించిన 20 మంది చిన్నారులకు బంగారు ఉంగరాల్ని బహుమతిగా ఇచ్చాడు విశాల్‌. ఈ సందర్భంగా విశాల్‌ - వరలక్ష్మి చేసిన హంగామా ఓవరాక్షన్‌ని తలపించింది.

అందరికీ అర్థమైపోయింది:

ఇదిలా వుంటే, 'నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు..' అంటూ వరలక్ష్మి, సోషల్‌ మీడియాలో విశాల్‌ని ఉద్దేశించి పోస్ట్‌ చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే, మొన్నీమధ్యనే 'ప్రేమకి టైమ్‌ లేదు.. కెరీర్‌లో బిజీగా వున్నాను.. అసలు పెళ్ళి మాటే లేదు..' అని ఈ మధ్యనే మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చింది. ఇక అప్పుడు అందరి కళ్ళూ తెరుచుకున్నాయి వీళ్ళ బ్రేకప్ నిజమే అని అందరికీ అర్థమైపోయింది.

హిట్ టాక్ సొంతం:

ఈ కూడికలు, తీసివేతలు చూస్తే శింబు విందులో వరలక్ష్మి పాల్గొనడం ఆసక్తికరంగా అనిపించక మానదు. ఇక అసలు విషయం ఏమిటంటే నటుడు శింబుకు విన్నైతాండి వరువాయా చిత్రం తరువాత సరైన హిట్ లేదనే చెప్పాలి. ఈ టైంలోనే అనేక ఆరోపణలు ఎదుర్కొని కేసులతో ఉన్న పరిస్థితుల్లో శింబు నటించిన అచ్చంయన్భదు మడమైయడా చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.

వరలక్ష్మిశరత్ కుమార్:

రాకరాకవచ్చిన ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేయడానికి చిత్ర యూనిట్ ఇటీవల నక్షత్ర హోటల్‌లో గ్రాండ్ పార్టీని ఏర్పాటుచేసింది. అయితే ఈ పార్టీలో కోలీవుడ్‌కి పలువురు సెలబ్రిటీలు త్రిష, రమ్యకృష్ణలు పాల్గొన్నప్పటికీ వరలక్ష్మిశరత్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శింబుతో మరింత సన్నిహితంగా ఉన్న ఆమె తీరు చూసిన జనం ఇంత త్వరగా విశాల్ ని మరిచిపోయి శింబుకి దగ్గరైపోయిందా? అని ముక్కున వేలేసుకున్నారని తమిళ ఇండస్ట్రీ లో గుసగుసలు పోతున్నారు..

English summary
Simbu who is high on his latest hit Acham Yenbadhu Madamaiyada and Trisha who is riding on the success of Kodi were present at the party. Ramya Krishnan, Varalakshmi Sarathkumar, Namitha werre also spotted at the party!
Please Wait while comments are loading...