Don't Miss!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
ఖరారు: వరుణ్ తేజ 'కంచె' టీజర్ విడుదల తేదీ
హైదరాబాద్:'ముకుంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమా 'కంచె'. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి..విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టీజర్ కట్ చేసారు. ఈ టీజర్ ని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అలాగే...స్వాతంత్రానికి ముందు జరిగే కథతో రూపొందే ఈ చిత్రం విడుదల తేదీని ...కూడా దేశభక్తికి చెందిన తేదీనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తేదీ మరేదో కాదు....అక్టోబర్ 2, అంటే గాంధీ జయింతి రోజున ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ వారికి, జమీందార్ వ్యవస్దకు వ్యతిరేకంగా సాగే పోరాటంతో ఈ చిత్రం కథ సాగనుంది.
ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ..సైనికుడుగా కనిపిస్తాడని తెలుస్తోంది. 1910 వ సంవత్సరంలో కథ జరుగుతుంది. వరుణ్ తేజలోని నటుణ్ణి క్రిష్ 'కంచె' చిత్రంలో వెలికి తెచ్చాడని యూనిట్ సభ్యులు అంటున్నారు... ఈ సినిమాతో వరుణ్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనీ చెబుతున్నారు.
ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిచింది.
‘టిట్టో ఎంబిఏ', ‘విరాట్టు', ఇండో - కెనడియన్ ఫిల్మ్ ‘ఎ లిటిల్ హెవెన్ ఇన్ మీ'లో నటించింది. ఆయా సినిమాలలో ఆమె నటన చూసి దర్శకనిర్మాతలు ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని యూనిట్ వర్గాలు తెలిపాయి.
రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది.
అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్న చిత్రం లోఫర్ రీసెంట్ గా ప్రారంభం అయ్యింది. లోఫర్ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది.