twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబు...ఆ రీమేక్ కమిటయ్యాడా?

    By Srikanya
    |

    హైదరాబాద్: వరస ఫ్లాపుల నుంచి కోలుకోవటానికి ప్రయత్నిస్తున్న హీరో రామ్ ఇప్పుడు ఓ తమిళ రీమేక్ కమిటయ్యారని సమాచారం. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ‘వేల ఇల్లై పట్టదారి' సినిమా విడుదలై అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం గట్టి పోటీ జరుగుతోంది. అయితే ఈ రైట్స్ ను ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ దక్కించుకున్నారు. తమ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు కోసం అన్వేషణ జరుగుతున్నట్లు సమాచారం.

    ధనుష్‌ నటించిన తాజా చిత్రం తాజాగా 'వేలై ఇల్లా పట్టదారి' (విఐపీ) అనే చిత్రాన్ని నటిస్తూ నిర్మించారు. హీరోగా ధనుష్‌కు ఇది 25వ చిత్రం. నూతన దర్శకుడు వేల్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. అమలాపాల్‌ నాయిక.' వేలై ఇల్లా పట్టదారి' అంటే డిగ్రీ పట్టా పుచ్చుకున్న నిరుద్యోగ యువకుడు అని అర్థం. తమ్ముడు హ్యాపీగా ఉద్యోగం చేసుకుటుంటే ఉద్యోగాన్వేషణలో ఉండే అన్న కథ ఇది. పట్టా పుచ్చుకుని నాలుగేళ్లు గడిచినా ఉద్యోగం రాని పక్షంలో ఈ యువకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అన్నదే ఈ కథ. ఈ ఏడాది జూలైలో విడుదలై ఘనవిజయం సాధించింది. గత రెండు నెలల్లో కోలీవుడ్‌లో ఎక్కడ చూసినా విఐపి గురించే చర్చ. ప్రస్తుతం రామ్ ‘పండగ చేస్కో' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.\

    ‘పండగ చేస్కో' విషయానికి వస్తే...

    VIP remake rights picked up by Ram?

    ఈ చిత్రంలో రామ్ ...ఎన్నారై గా కనిపిస్తాడని, అతను తన కుటుంబ సమస్య పరిష్కరించటానికి ఇండియా వస్తాడని తెలుస్తోంది. ఫస్టాఫ్ అత్తారింటికి దారేది,సెకండాఫ్ ...మిర్చిని గుర్తుకు తెస్తూ సాగుతుందని వినిపిస్తోంది. అయితే ఇది రూమరా లేక నిజమా అని తేలాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ హీరో. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత.

    దర్శకుడు గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ... డాలర్లలో మునిగి తేలిన కుర్రాడతను. కోరుకొంటే విలాసవంతమైన జీవితం అతని కాళ్ల ముందు ఉంటుంది. కానీ అదేం వద్దనుకొన్నాడు. తన వాళ్ల కోసం స్వదేశానికి వచ్చేశాడు. ఇక్కడికొచ్చి ఏం చేశాడో తెలియాలంటే మా చిత్రం చూడాలి అంటున్నారు . ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'.

    అలాగే ''రామ్‌ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్‌ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. హీరో,హీరోయిన్స్, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు. రామ్‌ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా చిత్రబృందం ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... ''తనవారి శ్రేయస్సు కోసం పాటుపడే కుర్రాడి కథ ఇది. ప్రతి సన్నివేశం ఓ పండగలా ఉంటుంది. రామ్‌ నటన, డ్యాన్స్‌, పోరాటాలూ.. తప్పకుండా ఆకట్టుకొంటాయి. సాయికుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్‌తో సినిమా చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు.

    చిత్రంలో సాయికుమార్‌, రావు రమేష్‌, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, సంగీతం: తమన్‌, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌

    English summary
    The remake rights for Dhanush’s recent super hit film ‘VIP’ have been picked up by well known producer Sravanthi Ravikishore. As can be expected, the film will have Ram as the hero.Ram is currently busy with the shooting of the film ‘Pandaga Chesko’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X