twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరిష్కారం: బాలకృష్ణ ‘లయన్’ కాదు...మరి

    By Srikanya
    |

    హైదరాబాద్ :నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్‌ఎల్‌వీ సినిమా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. ఈ చిత్రానికి ఇటీవలే టైటిల్ సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. ముందుగా ‘లయన్' అనే టైటిల్‌ను అనుకున్నప్పటికీ, ఆ టైటిల్‌పై వివాదం ఏర్పడడంతో చివరిగా సినిమాకు ‘వారియర్' అనే టైటిల్‌ను పెట్టే అవకాశమున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి.

    https://www.facebook.com/TeluguFilmibeat

    వివాదం ఏంటంటే... సత్యదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘ లయన్‌ ' అనే పేరును ఏపీ ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. అయితే ఈ టైటిల్‌తో తెలంగాణ ఫిలిం ఛాంబర్‌లో ఎప్పుడో రిజిస్టర్ చేయించాను అంటూ ఓ నిర్మాత వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్‌ వివాదం ఫిలింనగర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుని డిసెంబర్‌ 31న టీజర్‌ విడుదల చేయాలని దర్శకుడు సత్యదేవ్‌ భావిస్తున్నట్లు సమాచారం.

    ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. బాలకృష్ణ, శివబాలాజీ, అర్చన తదితరులపై ఫిల్మ్‌సిటీలోని రైల్వే స్టేషన్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.రామ్‌లక్ష్మణ్‌ మాస్టర్ల నేతృత్వంలో బాలకృష్ణపై పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

    'Warrior' finalized for Balakrishna's film ?

    నిర్మాత మాట్లాడుతూ... ''చిత్రంలో బాలకృష్ణ నాయకుడిగా, బాధ్యతగల అధికారిగా వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.

    ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను డిసెంబరు 31, అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజే అధికారికంగా టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

    అలాగే ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే బాలకృష్ణ ఫస్ట్‌లుక్ మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను యూనిట్ వర్గాలు ప్రకటించనున్నాయి. చిత్రానికి సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్‌

    దర్సకుడు మాట్లాడుతూ...

    ధర్మం ఎప్పుడూ ఒంటరికాదు. దానిని కాపాడ్డానికి ఎవరో ఒకరు శ్రమిస్తూనే ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టి, న్యాయాన్ని రక్షించి, అవినీతిపై యుద్ధం చేసిన పౌరుడి కథే మా సినిమా అంటున్నారు సత్యదేవా.

    అలాగే... ''లెజెండ్‌'తో బాలకృష్ణ ఇమేజ్‌ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పాత్ర అందుకు ఏమాత్రం తగ్గదు. మణిశర్మ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరిస్తాయ''న్నారు.

    English summary
    Balakrishna's 98th film unit have shown interest on the title 'Lion'. But as another producer has registered the title and he is not ready to give the title to anyone, the makers of Balakrishna's film have zeroed in on the title 'Warrior' at present.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X