twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి -2’ లో కంక్లూజన్ వేటికి...హైలెట్స్ ఏమిటి?

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొన్న శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ ‘బాహుబలి - ది కంక్లూజన్' గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

    మొదటి పార్ట్ లో కన్ఫూజన్ గా మిగిలిన ఎన్నో అంశాలుని ఈ చిత్రంలో కంక్లూజ్ చెయ్యబోతున్నారు. ఏమిటా అంశాలు అన్న విషయమై వన్ ఇండియా తెలుగు అందుకున్న సమాచారం మీతో పంచుకుంటోంది.

    ఈ రెండవ పార్ట్ లో హైలెట్ గా చెప్పుకోబడే అంశాలు ఏమిటి...వేటికి రాజమౌళి మరియు అతని టీమ్ ప్రయారిటీ ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఈ రెండో పార్ట్ గురించి ఎదురుచూస్తు్న్నారు.

    'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    స్లైడ్ షోలో బాహుబలి సెకండ్ పార్ట్ స్క్రిప్టు గురించి కొన్ని సంగతులు

    శివగామి ఛేజ్

    శివగామి ఛేజ్

    మొదటి సీన్ లో ...చేతిలో చంటిపిల్లాడు..వెనక వెంబడిస్తున్న శత్రువులు.. ఏం చేయాలో తెలియక శివగామి నేను చేసిన పాపాలు అంటుండగా సినిమా ప్రారంభంఅయ్యింది. పార్ట్-2లో శివగామి పూర్తి క్యారెక్టర్ తెలిసే అవకాశం ఉంది.

    శివగామి డెషిషన్

    శివగామి డెషిషన్

    శివగామి తన కుమారుడైన ...భళ్లాలదేవను కాదని.. అమరేంద్ర బాహుబలిని ఎందుకు రారాజుగా ప్రకటిస్తుంది. బిజ్జలదేవ మాటను లెక్కచేయకుండా మహేంద్ర బాహుబలిని ఎలా రక్షిస్తుంది? వంటి విషయాలు కన్‌క్లూజన్‌లో స్పష్టం కానున్నాయి!

    దేవసేన ఫ్లాష్‌బ్యాక్‌

    దేవసేన ఫ్లాష్‌బ్యాక్‌

    దేవసేన (అనుష్క) గురించి బిగినింగ్‌లో తెలిసింది చాలా తక్కువ..అసలు ఆమెను ఎందుకు భళ్లాల దేవ చెర పట్టాడనేది స్పష్టత రానుంది. ఆ ప్లాష్ బ్యాక్ సెకండ్ పార్ట్ లో హైలెట్ కానుంది.

    అవంతకకు దేవసేవ కు రిలేషన్ ఏంటి

    అవంతకకు దేవసేవ కు రిలేషన్ ఏంటి

    భళ్లాల చెర నుంచి దేవసేనకు విముక్తి కల్పించేందుకు అవంతిక(తమన్నా) విపరీతంగా శ్రమించడం.. వీళ్లిద్దరికి ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది.అదేంటి అనేది రివిల్ కావాలి.

    లవ్ స్టోరీ ఉందా..

    లవ్ స్టోరీ ఉందా..

    పార్ట్-1 బిగినింగ్‌లోనే నన్ను వద్దనుకున్నావ్.. వాడే కావాలనుకున్నావ్.. ఇప్పుడున్నాడా వాడు అని భళ్లాలదేవ దేవసేనను ఉద్దేశించి వెటకారంగా అంటాడు. దీనిని బట్టి దేవసేనను అమరేంద్ర బాహుబలి, భళ్లాలదేవ ఇద్దరూ ప్రేమించి ఉంటారని అర్థం అవుతున్నది. ఆ లవ్ స్టోరీ ఏంటి అనేది స్పష్టం కావాల్సి ఉంది.

    కొడుకుని చంపిన పగ ఏమైంది

    కొడుకుని చంపిన పగ ఏమైంది

    మొదటి నుంచీ భళ్లాల దేవను .. పౌరుషానికి.. అహంకారానికి.. దౌర్జన్యానికి నిదర్శనం భళ్లాలదేవ గా చూపారు. అయితే...భళ్లాల దేవ కొడుకు (అడవి శేషు)ని శివుడు(ప్రభాస్) చంపేసాడు. అప్పుడు ఏం చేస్తాడు..ఆ పగ తీర్చుకుంటాడా అనేది రెండవ పార్ట్ లో రావాలి.

    శివుడు గురించి తెలుస్తుందా

    శివుడు గురించి తెలుస్తుందా

    శివుడు (ప్రభాస్) మరెవరో కాదు...తన దాయాది (అమరేంద్ర బాహుబలి) కొడుకు అని ఎలా తెలుస్తుంది. రియాక్షన్ ఏంటి అనేది తేలనుంది

    యుద్దం ఎలా ఉంటుంది

    యుద్దం ఎలా ఉంటుంది

    తను ఇష్టపడ్డ దేవసేన (అనుష్క) ను శివుడు తప్పించాడు. భళ్లాల కొడుకును చంపేశాడు. ఈ విషయం తెలిస్తే భళ్లాల ఏం చేస్తాడు? యుద్దం ఎలా ఉండబోతోంది అనేది రెండవ పార్ట్ లో చూడాలి.

    మెయిన్ కంక్లూజన్

    మెయిన్ కంక్లూజన్

    మొదటి పార్ట్ లోని ...క్లైమాక్స్ ట్విస్ట్.. కట్టప్ప వెన్నుపోటుకు కారణం ఏమిటన్నది కీలకంగా ఉండనుంది. అమరేంద్ర బాహుబలి కు ముఖ్య అనుచరుడు..అత్యంత విశ్వసనీయ పాత్రుడు ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అన్నది కీలకం..

    అస్లమ్‌ఖాన్ రీ-ఎంట్రీ

    అస్లమ్‌ఖాన్ రీ-ఎంట్రీ

    సుదీప్ పాత్రకు కంక్లూజన్ సెకండ్ పార్ట్ లో రానుంది. కట్టప్పకు అవసరమైతే సహాయం చేస్తానన్న ఆస్లమ్‌ఖాన్ అవసరం పార్ట్ 2లో ఏంటనేది తేలనుంది.

    క్లైమాక్స్ వీళ్ల మీదే

    క్లైమాక్స్ వీళ్ల మీదే

    పార్ట్ టు క్లైమాక్స్ ..పూర్తిగా..శివుడా భళ్లాలా? అన్నట్లు సాగనుంది.మహేంద్రబాహుబలి (శివుడు) ప్రత్యక్ష పోరాటంలోకి దిగి పోరాటాలు చేసే మహాఘట్టం పార్ట్-2లో ఉంటుంది.

    ఎప్పటిలాగే..

    ఎప్పటిలాగే..

    సినిమా చివర్లో ఎలాగూ..భళ్లాలదేవ ఓటమి చూపెడతారు..దేవసేనకు విముక్తి కల్పిస్తారు.

    దేవ సేన స్పందన

    దేవ సేన స్పందన

    తన కొడుకు శివుడు ఎలా... భళ్లాల దేవను చంపుతాడు..అప్పుడు తాను పోగుచేసిన పుల్లలతో ఎలా చితి పెడుతుంది అనేది ఆసక్తికరమైన అంశం.

    బాహుబలి,భళ్లాల మధ్య ఎలా తగువు మొదలైంది

    బాహుబలి,భళ్లాల మధ్య ఎలా తగువు మొదలైంది

    మహిష్మతీ రాజ్య యువరాజులు అమరేంద్ర బాహుబలి.. భళ్లాలదేవ మధ్య తగువు ఎలా మొదలైందనేది ఈ సెకండ్ పార్ట్ లో కీలకం కానుంది. అలాగే ముఖ్యంగా బాహుబలికి ఎలా..భళ్లాల దేవ చెడు దోరణి విషయం తెలియవచ్చింది అనేది తెలుస్తుంది.

    షూటింగ్ ఎంతవరకూ...

    షూటింగ్ ఎంతవరకూ...

    ఇక ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ విషయానికి వస్తే...దాదాపు అందరి లీడింగ్ ఆర్టిస్టుల కాల్ షీట్స్ పూర్తి అయిపోయాయని తెలుస్తోంది.

    కేవలం...

    కేవలం...

    ఇంకా VFX వర్క్, ఇరవై రోజుల బ్యాలెన్స్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

    'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ...

    'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ...

    ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.

    విడుదల తేదీ

    విడుదల తేదీ

    ఈ చిత్రం విడుదల తేదీ. జనవరి 8, 2016 న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

    అంచనాలు

    అంచనాలు

    మొదటి పార్ట్ పెద్ద హిట్ అవటంతో రెండో పార్ట్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి

    పూర్తైంది

    పూర్తైంది

    ఈ రెండో పార్టు కు సంభందించి బిజినెస్ ఇప్పటికే పూర్తి అయ్యిందని సమాచారం.రామ్ గోపాల్ వర్మ సైతం ఈ విషయమై ట్వీట్ చేసారు.

    English summary
    Baahubali-The Conclusion... the hype, the buzz, the craze is going far beyond the limits. Baahubali - The Conclusion Will Release on Jan 8th 2016 All Leading actors call sheets are over - VFX work & 20 Days patch work Balance
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X