twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "ముకుందా"...కథని మెగా బాస్ లు మార్చే...??

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగబాబు కుమారుడు హీరోగా సిద్దమైన "ముకుందా" చిత్రం విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల టాపిక్స్ లు వినపడుతున్నాయి. తాజాగా వినపడుతున్న దాన్ని బట్టి..ఈ చిత్రం కథని మెగా బాస్ లు అల్లు అరవింద్, నాగబాబు కలిసి కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపారని చెప్పుకుంటున్నారు.

    మొదట ఈ కథని మహేష్ తో చేద్దామని దర్శకుడు నేరేట్ చేసాడని, అయితే మహేష్ ఇది తన లాంటి స్టార్ చేసే కథ కాదని, ఎవరన్నా కొత్త కొర్రాడు అయితే బాగుంటుందని సూచించాడని, అప్పుడు వరుణ్ తేజ్ ను ఎప్రోచ్ అయ్యారని అంటున్నారు. అప్పటికే చాలా కథలు విని ఫైనలైజ్ చేయని నాగబాబు ఈ కథ విని ఇంప్రెస్ అయ్యారని, అయితే అల్లు అరవింద్ మాత్రం ఈ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సయ్యాయని,వాటిని కలపాలని సూచించారని చెప్పుకుంటున్నారు.

    దాంతో మరోసారి స్క్రిప్టు పై దర్శకుడు తన టీమ్ తో కలిసి కసరత్తు చేసి, అల్లు అరవింద్, నాగబాబు చెప్పిన విధంగా కొత్త హీరో ని యాక్షన్ హీరోగా లాంచ్ చేయటానికి పనికొచ్చే విధంగా యాక్షన్,మాస్ ఎలిమెంట్స్ కలిపారని అంటున్నారు. అదే ఈ మెగాబాస్ లు కల్పించుకోకపోతే సీతమ్మ వాకిట్లో తరహాలో సున్నితమైన భావోద్వేగాలతో నడిచే కథ గా ఉండేదని, అప్పుడు హిట్టైనా, హీరోని తాము అనుకున్నట్లు యాక్షన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేయలేమని భావించే ఈ మార్పులు చేయించారని చెప్పుకుంటున్నారు. తమ మెగా కుటుంబం నుంచి వచ్చే హీరోపై ఉండే అంచనాలను తీర్చే విధంగా చిత్రం తయారైందని చెప్పుకుంటున్నారు.

    Who Changed Mukunda And Why?

    ‘ముకుందా' ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఇటీవలే విడుదల చేసిన వరుణ్‌తేజ్ ఫస్ట్‌లుక్ మరియు ఫస్ట్‌లుక్ టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు.

    వరుణ్‌తేజ్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ముకుందా. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.

    దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. పల్లెటూరి అనుబంధాలు, ప్రేమలు, రాజకీయాలు యువతరంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతున్నాయనే అంశాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఎలాంటి అంశాలకు ప్రభావితం కాని ఓ కుర్రాడి జీవితం ప్రేమ కారణంగా ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

    ఇదివరకు నేను తెరకెక్కించిన చిత్రాలకి భిన్నంగా యాక్షన్‌కి ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నా. ప్రతీ సన్నివేశం సహజంగా కనిపించాలని భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. యువతరం భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తూ సాగే ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. వరుణ్‌తేజ్ నటన, పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగే కథ ఇది. ముకుంద అనే ఓ యువకుడి ప్రేమపై స్థానిక పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపించాయి? వాటి నుంచి బయట పడేందుకు అతను ఏం చేశాడు? అనే విషయాలు ఆసక్తికరం. వరుణ్‌తేజ్‌ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.'' అన్నారు.

    English summary
    Nagababu and Allu Arvind are the guides for Mukunda script changes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X