twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ ని ఎన్టీఆర్ సినిమాకు కాదన్న కారణం

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్, కాజల్ కాంబినేషన్ లో గతంలో బృందావనం, బాద్షా చిత్రాలు వచ్చి విజయవంతమయ్యాయి. అదే హిట్ పెయిర్ తో సినిమా చేస్తే క్రేజ్ బాగుంటుందని నిర్మాత భావించి,ఆమెను తీసుకుని అఫీషియల్ గా కూడా ప్రకటించారు. అయితే అనుకోని విధంగా ఆమె ఈ సినిమాలో లేదనే వార్త వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికి కారణం...ఏమిటనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్...కొత్త అమ్మాయిని పెడదామన్నాడని, పూరికి కూడా వేరే హీరోయిన్ చేద్దామనే ఆలోచన ఉందని ఇలా రకరకాలుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే నిజం వేరే ఉంది అంటన్నారు.

    పూరితో ఎన్టీఆర్ చేద్దామనుకున్న ఈ చిత్రాన్ని పూరి...100 రోజుల్లో పూర్తి చేద్దామని నిర్ణయించుకున్నారట. ఆ స్పీడుకు తగినట్లుగా ఉండాలంటే...హీరోయిన్ డేట్స్ బ్రేక్ లేకుండా కావాలి. అయితే కాజల్ ..బల్క్ డేట్స్ ఇస్తుంది కానీ...కంటిన్యుగా...వీరు అడిగిన డేట్స్ ఇవ్వలేని పరిస్ధితిలో ఉందిట. ఆమె ..తెలుగు,తమిళ సినిమాలు ఒప్పుకుని ఉండటంతో ...ఇబ్బంది ఎదురౌతుందనే ఆలోచనతో ..ఎడ్జెస్ట్ చేయలేనని చెప్పేసిందిట. దాంతో వేరే దారిలేక వేరే హీరోయిన్ ని వెతుకుతున్నారని తెలుస్తోంది. మధురిమ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.

    బండ్ల గణేష్ నిర్మాతగా పరమేశ్వర ప్రొడక్షన్స్ వారి 5 వ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రం భారీగా నిర్మించనున్నానని బండ్లగణేష్ చెప్తున్నారు. ఆంధ్రావాలా చిత్రం తర్వాత ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్ లో చిత్రం రాలేదు. వీరి కాంబినేషన్ లో చిత్రం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు కానీ ఇన్నాళ్లకు కానీ వీలుపడలేదు.

    why Kajal rejecting NTR

    ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. గతంలోనూ ఎన్టీఆర్ పోలీస్ గా కనిపించి అలరించారు. ఇప్పుడు మరోసారి ఆ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారక్టరైజేషన్ ప్రత్యేకంగా కనిపించనుందని సమాచారం. అవినీతి తో నిండిన పోలీస్ అథికారిగా కనిపిస్తారు. పూరీ సినిమాలంటే డైలాగులు అద్బుతంగా ఉంటాయని అంటూంటారు అభిమానులు. క్యాచీగా ఉండి చిన్నా పెద్ద అందరినీ అలిరిస్తూంటాయి. ఎన్టీఆర్ ఇప్పటివరకూ చెప్పనని తరహాలో పంచ్ లతో కూడిన డైలాగులను పూరి ప్రత్యేకంగా రాసినట్లు చెప్తున్నారు.

    ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత...పూరి ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ కథ వేరే వారినుంచి తీసుకోలేదు. అలాంటిది తొలిసారిగా వక్కంతం వంశీ నుంచి తీసుకోవటంతో అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి 'నేనో రకం' అనే టైటిల్ ని పరిశీలిస్తునట్లు సమాచారం. ఈ టైటిల్ కి 'ఫుల్లీ కరెప్టడ్'...ఇదే ఉపశీర్షిక.

    ఎన్టీఆర్ ...అవినీతితో నిండిపోయి ...ఎప్పుడూ లంచం...లంచం అంటూ తిరిగే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. పూర్తి మాస్ మసాలాతో సాగే పాత్ర ఇది. కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Kajal Agarwal reportedly walked out of Jr NTR's upcoming flick under the direction of Puri Jagannath.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X