twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ ముంబై షిఫ్ట్ కి కారణం ఇదా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు రోజుల క్రితం తాను జనవరి 1 దాటిన తర్వాత ఇక ముంబై షిప్ట్ అయిపోతున్నానని,హైదరాబాద్ లో తన మిత్రులను మిస్సవుతున్నట్లు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇన్నాళ్లు ఇక్కడే సెటిలైన వర్మ హఠాత్తుగా ముంబై షిప్ట్ వెనుక కారణమేంటనేది హాట్ టాపిక్ గా మారింది. అప్పలరాజు చిత్రం కోసం తెలుగుకు వచ్చిన ఆయన ఇక్కడే దాదాపు సెటిలైపోయారు. హిందీ సినిమాలు తగ్గించుకుంటూ వచ్చారు.

    ఐస్ క్రీమ్ వంటి సీగ్రేడ్ సినిమాలు సైతం ఇక్కడ చేసేసారు. అయితే ఇవేమీ ఇక్కడ వర్కవుట్ కాలేదు. తెలుగు వారు ఆయన్ను గతంలో ఆదరించినట్లు అక్కున చేర్చుకోలేదు. ఆయన్ని మీడియానే కాదు అభిమానులు సైతం విమర్శించటం మొదలెట్టారు. దానికి తోడు ఆయన మెగా క్యాంప్ ని కొంతకాలం ఇక్కడ పొలిటీషన్స్ ని కొంతకాలం ట్వీట్స్ తో సెటైర్స్ వేయటం కూడా చాలా మందికి ఆయనపై ఇంట్రస్ట్ తగ్గిపోయేలా చేసింది. సినిమాలు ప్రక్కన పెట్టి కేవలం ట్వీట్స్ తో కాలం గడపటం సినిమా ప్రియులకు మింగుడుపడలేదు. ఈ నేపధ్యంలో ఆయన ముంబై షిప్ట్ అవుతున్నానంటూ ప్రకటన చేసారు.

    Why RGV want to shift to Mumbai

    వర్మ ముంబై షిప్ట్ వెనక కారణం...అమితాబ్ తో సర్కార్ 3 ని పట్టాలు ఎక్కించాలనే అంటున్నారు.రీసెంట్ గా అమితాబ్ ని కలిసి కథ వినిపించి ఓకే చేయించుకున్న ఆయన న్యూ ఇయిర్ లో ఈ చిత్రం ప్రకటన చేసి మళ్లీ బాలీవుడ్ ని తన వైపు తిప్పుకోవాలనే ఫిక్స్ అయ్యాడుట. అక్కడే వరస ప్రాజెక్టులు చేసి తెలుగు పరిశ్రమకు దూరంగా కొంతకాలం పాటు ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌' చిత్రం విడుదల నిలిపివేయాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన పన్నీర్‌సెల్వి అనే మహిళ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పుడు సమాచారంతో ఈ చిత్రాన్ని తీశారని, దీనివల్ల తమిళనాడులో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.

    English summary
    Ram Gopal Varma will be shifting his base to Mumbai once again from Hyderabad
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X